Nayanthara: ఆ పార్ట్‌కు ప్లాస్టిక్ సర్జరీ.. క్లారిటీ ఇస్తూ నయనతార ఆసక్తికర కామెంట్స్

by Hamsa |   ( Updated:2024-10-28 10:24:29.0  )
Nayanthara: ఆ పార్ట్‌కు ప్లాస్టిక్ సర్జరీ.. క్లారిటీ ఇస్తూ నయనతార ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ నయనతార(Nayanthara) తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేసి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. గత ఏడాది వరుసగా మూడు చిత్రాలతో అలరించిన నయనతార(Nayanthara) ప్రజెంట్ ఓ ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే నయన్ అందంగా కనిపించాలని ఓ పార్ట్‌కి సర్జరీ చేయించుకున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయన్ (Nayanthara)ప్లాస్టిక్ సర్జరీ గురించి స్పందించి క్లారిటీ ఇచ్చింది. ‘‘గత కొద్ది కాలంగా నేను సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే అందులో ఎలాంటి నిజం లేదు. నా కనుబొమ్మలు(eyebrows) అంటే నాకు చాలా ఇష్టం. వాటి ఆకారం ఎప్పుడూ మారుస్తూ ఉంటాను. ప్రతి రెడ్ కార్పెట్ ఈవెంట్ల(Red Carpet Event)కు ముందు వాటిని మార్చుతుంటాను. వాటి కోసం ఎంతో సమయాన్ని వెచ్చించి అందంగా ఉండేలా సెట్ చేసుకుంటాను. కనుబొమ్మల(eyebrows) ఆకారం మారినప్పుడల్లా ముఖంలో మార్పు కనిపిస్తుంది.

అందుకే నా ముఖంలో మార్పులు వచ్చాయని ప్రజలు భావించి నేను సర్జరీ(surgery) చేయించుకున్నా అంటున్నారు కావచ్చు. కానీ వాళ్లు అనుకున్నది నిజం కాదు. అలాగే డైటింగ్ వల్ల కూడా నా ముఖంలో మార్పులు వస్తుంటాయి. ఒక్కొసారి బుగ్గలు వచ్చినట్లు కనిపిస్తుంటాయి. మరోసారి అవి లోపలికి వెళ్లినట్లు అనిపిస్తుంటుంది. కావాలంటే మీరు నన్ను గిచ్చి చూడొచ్చు. నా శరీరంలో ఎక్కడా ప్లాస్టిక్ ఉండదు’’ అని చెప్పుకొచ్చింది.

Read More..

Aishwarya Rai: శారీరకంగా-మానసికంగా టార్చర్ చేశాడు.. స్టార్ హీరోపై ఐశ్వర్య రాయ్ సంచలన కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed