డేటింగ్, ఎఫైర్‌లపైనే పిచ్చి.. వాళ్లకు సినిమాలు అవసరంలేదు

by Hamsa |
డేటింగ్, ఎఫైర్‌లపైనే పిచ్చి.. వాళ్లకు సినిమాలు అవసరంలేదు
X

దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ హీరో, అనిల్ కపూర్ కొడుకు హర్ష వర్ధన్ కపూర్.. అభిమానుల యాటిట్యూడ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల కాలంలో భారతీయ ప్రేక్షకులకు డేటింగ్, ఎఫైర్‌లపై ఉన్నంత ఆసక్తి సినిమాను అర్థం చేసుకోవడంలో లేదని సెటైర్లు వేశాడు. ఈ మేరకు రాజ్ కుమార్ రావు, రాధికా ఆప్టే, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం 'మోనిక ఓ మై డార్లింగ్' ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీ బాగున్నప్పటికీ ట్రోలింగ్ చేయడం తనకు నచ్చలేదన్న హీరో ఈ వ్యాఖ్యలు చేశాడు. 'ఇక్కడ చాలా మంది నటన కంటే.. యాక్టర్స్ ఏం తింటున్నారు? ఎవరితో డేటింగ్ చేస్తున్నారు? ఎక్కడెక్కడ ఎవరితో తిరుగుతున్నారు? అనే దానిపైనే ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అలాంటి విషయాలతోనే బాలీవుడ్ ఆడియన్స్ సంతృప్తి చెందుతున్నారు. మంచి మంచి సినిమాల గురించి కూడా పట్టించుకోవడం మానేశారు. 'మోనికా ఓ మై డార్లింగ్' చాలా బాగుంది. అందరూ అద్భుతంగా నటించారు. వాసన్ ఐడియాలజీని మిలియన్ల మంది ఆదరిస్తారని ఆశిస్తున్నా' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

Advertisement

Next Story

Most Viewed