‘జాకెట్ విప్పిన అనసూయ’పై దారుణంగా ట్రోలింగ్స్.. అంతే ఘాటుగా స్పందిస్తూ..

by Javid Pasha |
‘జాకెట్ విప్పిన అనసూయ’పై దారుణంగా ట్రోలింగ్స్.. అంతే ఘాటుగా స్పందిస్తూ..
X

దిశ, సినిమా : స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి జబర్దస్త్‌‌ కామెడీ షోతో అలరించి మెప్పించిన ఫేమస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి తెలిసిందే. ఆ తర్వాత వెండితెరవైపు అడుగులు వేసిన ఈ బ్యూటీ, ఇక్కడ గ్లామరస్ రోల్స్ పెద్దగా చేయనప్పటికీ, తన నటతో అందరినీ ఆకట్టుకుంది. వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. ప్రజెంట్ పుష్ప2లో దాక్షాయణి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

టెలివిజన్ షోలకు గుడ్ బై చెప్పిన తర్వాత మూవీస్‌లో బిజీ అయిపోయిన అనసూయ ఆ మధ్య ఓసారి జబర్దస్త్ షోపై షాకింగ్ కామెంట్స్ చేసింది. అందులో చేసే డబుల్ మీనింగ్ కామెడీ తనకు అంతగా నచ్చడం లేదని వ్యాఖ్యానించింది. కాగా ఇప్పుడు మళ్లీ టెలివిజన్ షోలలో చేయడానికి మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. తాజాగా ఆమె రీ ఎంట్రీ ఇచ్చిన ఓ టీవీ షో ప్రోమో వైరల్ అయింది. ఇందులో శేఖర్ మాస్టర్, అనసూయ ఇద్దరూ ఏదో పోటీకి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఆమె అందరి ముందు తన జాకెట్ విప్పుతున్నట సన్నివేశాన్ని ప్రోమోలో చూపించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్స్ ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

‘జాకెట్ విప్పిన’ ప్రోమో అంటూ తనను అసభ్యంగా ట్రోల్ చేస్తున్న పలువురు నెటిజన్లకు అనసూయ ఘాటుగా రిప్లై ఇస్తోంది. ‘నిజంగా ఇది నాన్‌సెన్స్ ఏమన్నా అంటే అనసూయ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది’ అని కామెంట్ చేసిన ఓ నెటిజన్‌పై స్పందించిన ఆమె ‘‘మీరు పెట్టిన ఎమోజీలు, మీ మైండ్ సెట్ చూస్తుంటే ఏదో మానసిక రోగంతో బాధపడుతున్నట్లున్నారు’’ అంటూ ఇచ్చి పడేసింది.

తనను బ్యాడ్‌గా ట్రోల్ చేసేవారందరికీ వార్నింగ్ ఇచ్చిన అనసూయ ‘‘ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులుగా మేము కొన్ని చేయక తప్పదు. ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్లుగా నడుచుకోవాలి. ఇది మీకు అర్థం కావట్లేదు. మీ ప్రతాపం అంతా స్మాల్ స్ర్కీన్‌పై‌నే. అదే సినిమాల్లో ఎంత బోల్డ్ ఉంటే అంత బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తారు. కొందరికి ప్యాంట్, షర్ట్స్ కూడా ఇబ్బందే. నేనేం చెప్పానో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇకనైనా మారండి’’ అంటూ సీరియస్ అయింది అనసూయ. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Advertisement

Next Story

Most Viewed