- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజమౌళిని దాటేసిన యంగ్ డైరెక్టర్.. హనుమాన్ సక్సెస్‌తో వరించిన రూ.1000 కోట్ల ఆఫర్
దిశ, సినిమా: అతి చిన్న సినిమాగా తెరకెక్కి.. ఊహించని రేంజ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాల్లో హనుమాన్ ఒకటి. గత ఏడాది బలగం చిత్రం కూడా ఏ స్థాయిలో మారుమోగిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ ప్రజలంతా ఒక్కదగ్గర చేరి ఈ సినిమాను వీక్షించారు. ఊరు ఊరు ఈ సినిమాను చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతగా గుర్తింపు లేని నటులైన వారి నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు.
రీసెంట్‌గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ చిత్రం కూడా ఇదే తరహాలో బాక్సాఫీసును షేక్ చేసింది. ఈ ఏడాది సంక్రాతికి ఈ సినిమాతో పాటు స్టార్ హీరోల మూవీస్ విడుదలవ్వగా.. సూపర్‌స్టార్ మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేశ్‌కే గట్టి పోటీ ఇచ్చాడు. ఇక హీరో తేజా సజ్జా నటనకు ఆడియన్స్ అంతా ఫిదా అయిపోయారు. ఈ ఒక్క మూవీతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా దర్శకుడు అయిపోయాడు. అయితే పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ దర్శకుడికి అడ్వాన్స్ ఇవ్వడానికి ముందుకొచ్చాయట. ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నరంటూ ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘నేను డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వను. ప్రేక్షకులకు క్వాలిటీ సినిమా చూపించడమే నాకు ముఖ్యం. బడ్జెట్‌తో సినిమా తీసే దర్శకుడిని కాదని స్టార్టింగ్‌లోనే ప్రొడ్యూసర్లకు చెప్పాను. 10 కోట్ల బడ్జెట్‌తో మూవీ చేస్తే.. దాన్ని 50 కోట్ల చిత్రంగా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తాను. 40 కోట్లతో తీస్తే.. 150 కోట్ల మూవీని చూపిస్తాను’ అంటూ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు ఇంత పెద్ద ఆఫర్ టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళికి కూడా రాలేదు. ఒక్క సినిమాతో ఈ డైరెక్టర్ తలరాతే మారిపోయిందంటూ నెటజన్లు కామెంట్లు పెడుతున్నారు.