ఏడ‌డుగుల బంధంతో ఒక్కటైన Hansika, ప్రియిడు Sohail Kathuria.. వెడ్డింగ్ పిక్స్ వైరల్

by samatah |   ( Updated:2022-12-05 06:08:57.0  )
ఏడ‌డుగుల బంధంతో ఒక్కటైన Hansika, ప్రియిడు Sohail Kathuria..  వెడ్డింగ్ పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ హన్సిక కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. ఇన్నాళ్లు తన ప్రేమ విష‌యాన్ని ర‌హ‌స్యంగా దాచిన నటి ఇటీవ‌లే ప్రియిడు సొహైల్‌‌కు ఈఫిల్ ట‌వ‌ర్ ముందు ల‌వ్‌ను ప్రపోజ్ చేసిన ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. త్వర‌లోనే అత‌డిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రక‌టించింది. ఇక చెప్పినట్లుగానే సొహైల్ క‌తురియాతో ఏడ‌డుగులు వేసింది. ఆదివారం జైపూర్‌లోని ముందోతా ఫోర్ట్ ప్యాలెస్‌లో వీరి పెళ్లి వైభ‌వంగా జ‌రిగింది.పెళ్లి వేడుక‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. అయితే అసలు ట్వీస్ట్ ఏమిటంటే హ‌న్సిక‌కు ఇది మొద‌టి వివాహం కాగా సొహైల్‌కు మాత్రం రెండోది. గ‌తంలో హ‌న్సిక స్నేహితురాలు రింకీ బ‌జాజ్‌ను సొహైల్ పెళ్లిచేసుకున్నాడు. ఏదో కారణంగా ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇక మొన్నటి వరకూ ఈ విషయం బయటకు రాలేదు. ఇప్పడు బయట పడటంతో సొహైల్‌, రింకీ బ‌జాజ్ పెళ్లికి హ‌న్సిక హాజ‌రైన పాత వీడియోలు, ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్కర్లు కొడుతున్నాయి. ఏదేమైనప్పటికి ఒక్క కొత్త జీవితాన్ని మాత్రం స్టార్ట్ చేసింది హన్సిక.

Also Read......

మహేష్ కి విలన్ గా బాలీవుడ్ హీరో Saif Ali Khan..

Advertisement

Next Story

Most Viewed