- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను పునర్జన్మ పొందినట్లుగా ఉంది: రీఎంట్రీపై Hamsa Nandini
దిశ, సినిమా: గత కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్‌తో పోరాడి ఈ మధ్యే కోలుకున్న హంసా నందిని.. తన 38వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంది. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో తదుపరి ప్రాజెక్ట్ కోసం మళ్లీ సెట్‌లోకి అడుగుపెట్టినట్లు చెప్పిన నటి.. 'పునర్జన్మ పొందినట్లు అనిపిస్తుంది' అంటూ హ్యాపీగా ఫీల్ అయింది. తొమ్మిది సైకిల్స్ కీమోథెరపీ చేయించుకుని మళ్లీ కెమెరా ముందు సజీవంగా నిలబడటాన్ని మరో జన్మగానే భావిస్తున్నట్లు తెలిపింది.
కాగా ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్న నటి.. టోటల్ రెడ్ కలర్ శారీలో దర్శనమివ్వగా కారావ్యాన్ నుంచి దిగుతూ అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. అంతేకాదు మరో ఏడు కీమోథెరపీ పరీక్షలు మిగిలి ఉన్నాయని గుర్తుచేసిన హంస.. 'ఈ రాత్రి నా సహనటులు.. చిత్ర బృందంతో జరుపుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంతకాలం ఈ హ్యాపీనెస్ మిస్ అయ్యాను. మీ అందరి ప్రేమ, మద్దతు లేకుండా సాధ్యం కాదు. నేను తిరిగి వచ్చినందుకు మీ అందరికీ ఆత్మీయమైన కౌగిలింత' అని తెలిపింది.
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా 'మీ పునరాగమనం మాకెంతో ధైర్యాన్నిచ్చింది' అంటూ అభిమానులు నెట్టింట సంబరాలు చేసుకుంటున్నారు.
- Tags
- Hamsa Nandini