Guppedantha Manasu: జగతి జ్ఞాపకాలను తలచుకుంటూ ఏడుస్తున్న మహేంద్ర.. గుండెల్ని పిండేసే సీన్

by Prasanna |   ( Updated:2023-10-20 14:34:53.0  )
Guppedantha Manasu: జగతి జ్ఞాపకాలను తలచుకుంటూ ఏడుస్తున్న మహేంద్ర.. గుండెల్ని పిండేసే సీన్
X

దిశ, వెబ్ డెస్క్: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

‘నీ జ్ఞాపకాల నుంచి నన్ను బయటికి తీసుకురావడం అంత సులభం కాదు..మనమిద్దరం ఎక్కడ కలిసామో ఆ చోటికే తీసుకొచ్చారు. ఇక్కడ మనం గడిపిన ప్రతిక్షణం నా కళ్లముందు కదులుతుంటే.. ఇంక నేను నిన్ను ఎలా మరిచిపోవాలి జగతి. అసలు నీకు నన్ను వదిలి పెట్టి ఎలా వెళ్లాలనిపించింది.. నా వల్ల కావట్లేదు అంటూ.. ఫోటోకి ముద్దపెట్టుకుంటాడు. . నీ జ్ఞాపకాలతో నా గుండె అలసిపోతుంది.. ఈ బాధ తట్టుకోలేక పోతున్న జగతీ..’ అంటూ మళ్లీ పెద్దగా ఏడుస్తాడు.

మహేంద్ర కన్నీరు చూసిన తర్వాత ఈ సీరియల్ చూసే ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవ్వకుండా ఉండలేరు. ఇక అప్పుడే రిషి వసులు.. ‘డాడ్ డాడ్.. మీరు ఇక్కడేం చేస్తున్నారు .. ఏమైంది సార్?’అంటూ ఇద్దరు పరుగున వస్తారు. ‘ఏం లేదు నాన్నా..ఇక్కడికి ఇలా రావాలనిపించింది..ఈ చుట్టూ ప్రదేశాలు చాలా బాగుంటాయి.. వెళ్లండి.. మీ ఇద్దరూ వెళ్లి చుట్టూ చూసి రండి’ అని మహేంద్ర అంటాడు ‘మీకు ఎలా తెలుసు?’ సార్ అంటూ సందేహంగా వసు అడుగుతుంది. కాస్త తడబడిన మహేంద్ర.. అంటే అరక అందాల గురించి మనం వింటూనే ఉంటాం కదమ్మా అంటూ సినిమా రేంజ్లో కవర్ చేసుకుంటాడు.

ఇవి కూడా చదవండి : Brahmamudi: నగలు దొంగతనం చేస్తూ.. ఇంట్లో వాళ్లకి దొరికిపోయిన రాహుల్

Advertisement

Next Story