Guppedanta Manasu: స్నేహమంటే ఇదేనా అంటూ గౌతమ్‌ని ప్రశ్నిస్తున్న రిషి !

by Prasanna |   ( Updated:2022-12-03 09:32:26.0  )
Guppedanta Manasu: స్నేహమంటే ఇదేనా  అంటూ గౌతమ్‌ని ప్రశ్నిస్తున్న రిషి !
X

దిశ, వెబ్ డెస్క్ : నేటి సీరియల్ ఎపిసోడ్‌లో ఈ సీన్లు హైలెట్

గౌతమ్‌ని రిషి ఈ విధంగా 'స్నేహం అంటే ఇదేనా..రా..నన్ను ఇంత మోసం చేస్తావా? నువ్వు.. నిన్ను ఎప్పటికి నమ్మనురా.. మా డాడ్ వాళ్లు చెప్పొద్దు అంటే.. నువ్వు అలా చెప్పకుండా ఎలా ఉంటావ్ ? నేను ఎంత బాధ పడుతున్నానో దగ్గరుండి చూసావ్..అలాంటిది నా ముందు నటించడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా.. అని గట్టిగా నిలదీస్తాడు..కానీ గౌతమ్ అవేమి పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. వాళ్ళ మాటలకు ఏమి చెప్పాలో తెలియక వసు కారు ఎక్కి కూర్చొంటుంది. రిషి కోపం తగ్గించడానికి వసు, రిషి చేతిలో చేయి వేసి..మీరు బాధ పడితే నేను చూడలేను సార్..గౌతమ్ ఎవరు..మీ ప్రాణ స్నేహితుడు..తను ఎందుకు అలా చేయాలిసి వచ్చిందో మనకి తెలీదు కదా సార్ అని అంటూ..ఈ విషయంలో గౌతమ్ తప్పు ఉంటె మహేంద్ర సార్ తప్పు కూడా ఉంటుంది..మీరు ఊరికే కోపం తెచ్చుకోకండని సర్ది చెప్పిన.. రిషి వినడు.

ఇక మహేంద్ర , రిషీ ఇద్దరూ ఈ విధంగా రిషి గౌతమ్ దగ్గరికి వెళ్లింది నేను..గౌతమ్ ఇంట్లో ఉంటానని అడిగింది నేను.. ఈ విషయంలో గౌతమ్ తప్పు ఏమి లేదు..తన మీద నీ కోపాన్ని చూపించకు..నీకు కోపం ఏదయినా ఉంటె నా మీద చూపించు.నేను నీ ప్రేమ కోసమే అక్కడికి వెళ్ళాను. నేను అక్కడే ఉన్నానే కానీ..నా మనసు అంతా నీ మీదే ఉంది..గౌతమ్ ఇప్పటికే చాలా నలిగిపోయాడు..తనని ఇంకా బాధ పెట్టకు అని మహేంద్ర అంటాడు. ఈ విధంగా సాగుతూ ఉంటుంది. తర్వాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.

Advertisement

Next Story