- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘గుంటూరు కారం’ ఆల్ టైమ్ రికార్డ్.. కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న మహేశ్ మూవీ
దిశ, సినిమా :సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ మూవీ గుంటూరు కారం.. జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ బ్యూటీ శ్రీలీలా, నటి మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. మొదట్లో ఈ మూవీ గురించి మిక్స్ డ్ వినిపించినప్పటికీ.. ఆ తర్వాత మంచి ఆదరణ పొందుతూ కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకుపోతోంది. రీలీజైన ఫస్ట్ రోజే ఈ చిత్రం రూ.94 కోట్లు కలెక్ట్ చేయగా.. రెండవ రోజు రూ.120 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రజెంట్ రూ.200 కోట్ల క్లబ్‌లో చేరి కౌంటింగ్ స్టార్ చేసింది. ఇక వన్ వీక్‌లోనే రూ.212 కోట్ల గ్రాస్ అందుకుని రీజినల్ మూవీస్‌లో రికార్డు క్రియేట్ చేసిన గుంటూరు కారం మూవీ ప్రజెంజ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిందనే చెప్పాలి. మరోవైపు తాజాగా మేకర్స్ 10 డేస్ కలెక్షన్ల వివరాలను కూడా అనౌన్స్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పదిరోజుల్లో రూ.231 కోట్ల గ్రాస్‌ను సాధించి ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిందని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.