LGBTQIAకి మద్దతు ఇచ్చినందుకే దారుణంగా వేధించారు: Celina Jaitley

by Prasanna |   ( Updated:2023-07-04 07:19:12.0  )
LGBTQIAకి మద్దతు ఇచ్చినందుకే దారుణంగా వేధించారు: Celina Jaitley
X

దిశ, సినిమా : LGBTQIA కమ్యూనిటీకి మద్దతు ఇచ్చినందుకు తనకు బెదిరింపులు వచ్చాయని నటి సెలీనా జైట్లీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్న ఆమె.. సమాజంలో నెలకొన్న లింగ వివక్షతోపాటు ట్రాన్స్‌జెండర్ సమస్యపై కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పింది. ‘సినిమా పరిశ్రమకు చెందిన LGBTQIA సహోద్యోగులు ఓ ఇష్యూలో వాళ్లకు మద్ధతుగా నిలవాలని నా సహాయం కోరారు. నేను వాళ్లకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అటువైపు మొగ్గు చూపాను. అయితే ఈ కారణంగా ప్రమాదకరమైన బెదిరింపులు వచ్చాయి. దీంతో అదనపు వ్యక్తిగత భద్రతను నియమించుకోవాల్సి వచ్చింది. అంతటితో ఆగకుండా నా స్వంత లైంగికతపై ప్రశ్నించడం మొదలుకొని స్నేహితుల సర్కిల్‌ను దెబ్బ తీయడం, సైన్ చేసిన సినిమాల నుంచి తొలగించబడటం వరకు చాలా కష్టాలను అనుభవించాను’ అంటూ సెలీనా ఎమోషనల్ అయింది.

Read More: అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన స్టార్ నటి.. అతిపెద్ద రోగంతో బాధపడుతుందట

Advertisement

Next Story

Most Viewed