రవితేజ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి ఆ సినిమా!

by Hamsa |   ( Updated:2022-08-27 07:27:51.0  )
రవితేజ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి ఆ సినిమా!
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజా రవితేజ హీరోగా, శరత్ మండవ కాంబినేషన్‌లో నటించిన చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. ఇక ఈ సినిమాలో తొట్టెంపూడి వేణు చాలా కాలం తరువాత కమ్‌బ్యాక్ ఇవ్వడం విశేషం. కాగా దివ్యాంశ కౌశిక్, రజీషా విజయన్‌లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం భారీ అంచనాలతో థియేటర్స్‌లో జూలై 29న విడుదలైంది. కానీ, బాక్సాఫీసు వద్ద అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో రవితేజ ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ ప్రకటించింది. రామారావు ఆన్ డ్యూటీ' ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం సోనీ లివ్‌లో సెప్టెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి : IMDB రేటింగ్‌లో "లైగర్" చెత్త రికార్డ్..

Advertisement

Next Story

Most Viewed