పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుంచి క్రేజీ అప్డేట్

by Hamsa |   ( Updated:2023-03-10 15:19:08.0  )
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుంచి క్రేజీ అప్డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా నుండి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్రబృందం శుభవార్త చెప్పింది. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాతలు సినిమాటోగ్రాఫర్ అయానంకబోస్, ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి భారీ సెట్‌లో చర్చిస్తున్న స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. త్వరలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దీనికి మేకర్స్ భారీ సెట్‌ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.

Also Read..

పవిత్ర-నరేష్ : పెద్దలు లేకుండా జరిగిన ఏకైక పెళ్లి ఇదే

Advertisement

Next Story