‘బ్రో’ అభిమానులకు గుడ్ న్యూస్.. మూవీ టికెట్ల ధరలపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

by Dishaweb |   ( Updated:2023-07-19 10:26:59.0  )
‘బ్రో’ అభిమానులకు గుడ్ న్యూస్.. మూవీ టికెట్ల ధరలపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘బ్రో’. మొదటిసారి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో పవన్ నటిస్తున్న ఈ సినిమా తమిళంలో వచ్చిన ‘వినోదాయ సిద్ధం’ మూవీకి తెలుగు రీమేక్. కానీ అసలు స్టోరీలో కొన్ని మార్పులు చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే అందించగా సముద్రఖని దర్శకత్వం వహించాడు. కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ ఫిమేల్ రోల్ పోషించిన ఈ మూవీ జులై 28న రిలీజ్ కానుంది. విడుదల టైం దగ్గర పడుతుండటంతో తాజాగా మీడియాతో మాట్లాడిన ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్.. మూవీ టికెట్ ధరలపై అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ‘ఈ సినిమాను పరిమిత బడ్జెట్‌లోనే తెరకెక్కించాం. అందుకే టికెట్ల ధరలు పెంచకూడదని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read More: సెక్స్ వర్కర్ పాత్రలో గొప్ప అనుభూతి పొందాను.. నాకు అలాంటి కథలే కావాలి

‘ఉస్తాద్’ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న లోకేషన్స్

Advertisement

Next Story