Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ .. దసరాకి 'ఫౌజీ' నుంచి అదిరిపోయే ట్రీట్

by Prasanna |
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ .. దసరాకి  ఫౌజీ నుంచి అదిరిపోయే  ట్రీట్
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణ హీరో రేంజ్ నుంచి పాన్ ఇండియా వరకు ఎదిగిన డార్లింగ్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. తాజాగా, హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా ఓ సినిమా రాబోతుందన్న విషయం మనకీ తెలిసిందే. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన ప్రేమ కథలతో మంచి గుర్తింపు పొందిన ఈ డైరెక్టర్ తో ప్రభాస్ చేస్తున్న ఫస్ట్ మూవీ అవ్వడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా ఓపెనింగ్ పూజా చాలా గ్రాండుగా జరిగింది.

'ఫౌజీ’ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ఉన్న ఈ మూవీ మొదటి షెడ్యూల్ తమిళ‌నాడులోని మ‌ధురైలో జ‌రుపుకుంటుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా నుంచి ద‌స‌రాకి అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాలో డార్లింగ్ కు జోడిగా ఇమాన్ ఎస్మాయిల్ కథానాయికగా న‌టిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ను అందివ్వనున్నారని తెలుస్తుంది. వచ్చే ఏడాదికి ఆడియెన్స్ ముందుకు రానుందని చిత్ర బృందం తెలిపింది.

Next Story

Most Viewed