- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
9వ అంతస్తు నుండి పడి మహిళ మృతి..
దిశ, శేరిలింగంపల్లి : మాదాపూర్ మై హోమ్ భుజ తొమ్మిదవ అంతస్తు పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి యువతి మృతి చెందిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక సమాచారం మేరకు ఒడిస్సా రాష్ట్రానికి చెందిన అశ్విత సింగ్ (25)కి భర్త, నాలుగేళ్ల బాబు ఉన్నారు. ఈయర్ నగరానికి చెందిన రాజేష్ బాబు సరోగసి ద్వారా పిల్లలను కనివ్వడం కోసం అశ్విత సింగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందుకుగాను అశ్విత సింగ్ తో రూ.10 లక్షలకు రాజేష్ డీల్ కుదుర్చుకున్నాడు. ఇందుకోసం ఆమెను ఒడిశా నుండి నగరానికి తీసుకువచ్చి మై హోమ్ భుజాలోని తన ఇంటిలో ఉంచాడు.
అయితే గత కొన్నాళ్లుగా అశ్విత సింగ్ కు రాజేష్ బాబు ప్రవర్తన నచ్చకపోవడంతో అశ్విత సింగ్ పారిపోవడానికి ప్రయత్నించింది. తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు మై హోమ్ భుజా తొమ్మిదవ అంతస్తు పై నుండి కింద పడి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా సరోగసి ద్వారా పిల్లలను కనేందుకు ఒప్పందం చేసుకుని మహిళ మృతి కారణమైన రాజేష్ బాబు పై కేసునమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.