‘హరుడు’ నుంచి గ్లింప్స్ రిలీజ్.. ఐదు నిముషాల్లోనే కథ ఓకే చేశారు అంటున్న డైరెక్టర్

by sudharani |
‘హరుడు’ నుంచి గ్లింప్స్ రిలీజ్.. ఐదు నిముషాల్లోనే కథ ఓకే చేశారు అంటున్న డైరెక్టర్
X

దిశ, సినిమా: ‘శివరామరాజు’ ఫేమ్ వెంకట్ తొలిసారి మాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరుడు’. డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తాళ్ళూరి దర్శకుడు. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్న ‘హరుడు’ నుంచి తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. అనంతరం మీడియాతో ముచ్చటించారు. దర్శకుడు రాజ్ తాళ్ళూరి మాట్లాడుతూ.. ‘ముందుగా నిర్మాత డాక్టర్ ప్రవీణ్ రెడ్డి‌కి థాంక్స్. ఐదు నిముషాల్లోనే కథ విని ఓకే చేశారు. వెంకట్‌తో ఐదేళ్ళ జర్నీ ఉంది. లవర్ బాయ్‌గా చేసిన ఆయన మాస్ హీరోగా ఇందులో చేశారు. నటశాసింగ్ కూడా నటించింది. సంగీత దర్శకుడు జిన్నా, ఎడిటర్ మారుతీ బాగా పనిచేశారు. నాకు దర్శకుల టీమ్ సపోర్ట్‌గా ఉండడంతో అవుట్‌పుట్ బాగా వచ్చింది’ అన్నారు.

హీరో వెంకట్ మాట్లాడుతూ ‘హరుడు చిత్రం కమర్షియల్ ఎలిమెంట్‌తో మాస్ ఎంటర్ టైనర్‌గా ఉంటుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా 60 శాతం పూర్తయింది. నిర్మాత డాక్టర్ అయినా... సినిమాపై తపనతో వచ్చారు. ఆయనకు మంచి హిట్ పడాలని ఆశిస్తున్నాను. నాకు పవర్ ఫుల్ రోల్ దర్శకులు ఇచ్చారు. మాస్ పాత్ర నేను మొదటిసారి చేశాను. నా పాత్రకు ధీటుగా హెబ్బాపటేల్ పాత్ర ఉంటుంది. అలాగే నటశాసింగ్ మరో పాత్ర చేసింది. స్పెషల్ సాంగ్‌లో సలోని చేశారు. మాస్ సినిమాకు ఫైట్స్ కీలకం. శివరాజ్ మాస్టర్ బాగా కంపోజ్ చేశారు. లోగడ షూటింగ్‌లో నాకు గాయాలు అయ్యాయి. అందుకే కొంత గేప్ కూడా తీసుకున్నాను. ఈ సినిమాలో తగు జాగ్రత్తలు తీసుకుని ఫైట్స్ చేశాను. వచ్చే నెలలో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు.


Advertisement

Next Story