GHMC: బ్యానర్లు, కటౌట్స్ హైదరాబాద్ లో ఎక్కడపడితే అక్కడ పెట్టడానికి వీల్లేదంటూ సీరియస్ అయిన జీహెచ్‌ఎంసీ..

by Prasanna |   ( Updated:2024-10-02 15:08:37.0  )
GHMC:  బ్యానర్లు, కటౌట్స్ హైదరాబాద్ లో ఎక్కడపడితే అక్కడ పెట్టడానికి వీల్లేదంటూ సీరియస్ అయిన జీహెచ్‌ఎంసీ..
X

దిశ, వెబ్ డెస్క్ : చిన్న సినిమా అయిన .. పెద్ద సినిమా అయినా ప్రమోషన్స్ ఎంత బాగా చేస్తే అంత బాగా జనాల్లోకి వెళ్తుంది. దాని కోసం మూవీ మేకర్స్ రక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వాటిలో ముందు వాల్ పోస్టర్స్ నుంచి మొదలుపెడతారు. కొత్త సినిమా విడుదలయ్యే ముందు గోడలపై వాల్ పోస్టర్స్ అతికించే పద్ధతి చాలా ఏళ్ళ నుంచి ఉంది. ఒక్క హైద్రాబాద్ లోనే కాకుండా పల్లెటూళ్ళలో గోడలపై కొత్త సినిమా పోస్టర్స్ అతికిస్తారు. చాలా మంది ఆ పోస్టర్ పై ఉన్న రిలీజ్ డేట్ చూసి మూవీ టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళు. కానీ, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) ఈ విషయం పై సీరియస్ అయింది.

పబ్లిక్ ప్రదేశాల్లో గోడలపై వాల్ పోస్టర్స్, పర్మిషన్స్ లేని వాల్ పెయింటింగ్స్ బ్యాన్ చేస్తున్నట్టు ఈ నోటీసును రిలీజ్ చేసింది. పర్మిషన్స్ లేకుండా వీటికి సంబంధించిన ఎలాంటి ప్రింట్స్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ పర్మిషన్ లేకుండా ప్రింట్ చేస్తే స్ట్రిక్ట్ నోటీసులు ఇస్తుంది. డిప్యూటీ కమిషనర్లు ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఎవరైనా రూల్స్ పాటించకపోతే ఫైన్స్ వేస్తామని తెలిపారు.

ఇకపై హైదరాబాద్ లో పోస్టర్ లు అన్నీ చోట్లా కనిపించావు. అలాగే ఫ్యాన్స్ కూడా వారి అభిమాన హీరోల బ్యానర్లు, కటౌట్స్ హైదరాబాద్ లో ఎక్కడపడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు అని ఈ నోటీసుతో పేర్కొంది. సినిమాకి ఇవే ముఖ్యం కదా.. మరి, ఇలాంటి వాటిపై నిషేధం విధిస్తే సినిమా ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisement

Next Story