గేదెలా ఉన్నావంటూ ఘోరంగా అవమానించారు: Geetha

by Hajipasha |   ( Updated:2022-11-30 13:09:00.0  )
గేదెలా ఉన్నావంటూ ఘోరంగా అవమానించారు: Geetha
X

సినిమా: ప్రముఖ టెలివిజన్ పర్స్‌నాలిటీ, కొరియోగ్రాఫర్ గీతా కపూర్ గతంలో బాడీ షేమింగ్‌కు గురైనట్లు తెలిపింది. 2008 నుంచి 'డ్యాన్స్ ఇండియా' రియాలిటీ షో జడ్జిగా వ్యవహరిస్తున్న ఆమె.. తొలినాళ్లలోనే ప్రజలచే అవమానించబడ్డట్లు తాజా ఇంటర్వ్యూలో ఆవేదన చెందింది. అలాగే తాను కొద్దిగా లావు ఉండటం కారణంగా 'గేదే'లా లావెక్కావంటూ ఎద్దేవా చేశారన్న గీత.. మెసేజ్‌ల ద్వారా కూడా కించపరిచేవారంటూ ఎమోషనల్ అయింది. 'మెయిల్స్ ద్వారా అసహ్యకరమైన వ్యాఖ్యలు వస్తాయి. ఏమి జరుగుతుందో తెలియక నిజంగా కలత చెందాను. నా కష్టాన్ని ఎవరూ చూడటం లేదు. నా పనిని గుర్తించట్లేదు. స్త్రీ పురుషుల మధ్య సమానంగా కూర్చొని ఉన్నత స్థానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నా. అది ఎవరికీ కనిపించట్లేదు' అని బాధపడినట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి : ఆకట్టుకుంటున్న Tapsee 'BLUR' Trailer

Advertisement

Next Story