Garikipati Narasimha Rao : కల్కి సినిమాపై గరికపాటి ఫైర్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-09-23 05:33:33.0  )
Garikipati Narasimha Rao : కల్కి సినిమాపై గరికపాటి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : బాక్సాఫిస్ హిట్ మూవీగా రికార్డు కలక్షన్లను కొల్లగొట్టిన కల్కి సినిమా కథపై ప్రవచన కర్త గరికపాటి నరసింహరావు ఫైర్ అయ్యారు. మహాభారతం నేపథ్యంలో ప్రభాస్ హీరోగా, అమితాబ్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించగా డైరక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన కల్కి 2898 ఏడీ సినిమాలో కర్ణుడు, అశ్వత్థామ పాత్రలను తప్పుగా చూపించారని, మహాభారతాన్ని వక్రీకరించారని..గరికపాటి మండిపడ్డారు. భారతంలో ఉన్నది వేరే..సినిమాలో తీసింది వేరు అని ఈ సినిమాతో ఇప్పటికప్పుడు కర్ణుడు, అశ్వథ్థామ హీరోలు అయి పోయారు..భీముడు, కృష్ణుడు విలన్లయ్యారన్నారు. ఆలస్యమైందా? అచార్య పుత్ర అని డైలాగ్ ఒకటి రాశారని.. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తే ఏది పడితే అది రాసేవాళ్లున్నారని.. అసలు భారతంలో కర్ణుడు ఎప్పుడూ కూడా అశ్వథ్థామను కాపాడడని.. అశ్వథ్థామే కర్ణుడ్ని కాపాడతాడని.. ఆయన మహావీరుడంటూ కల్కి చిత్రకథను గరికపాటి తప్పుబట్టారు.

కాగా తన సినిమా ఓ ఫిక్షన్ అని నాగ్ అశ్విన్ ఇంతకుముందే స్పష్టం చేశారు. కల్కి సినిమా మూడు వేర్వేరు ప్రపంచాల మధ్య తిరిగే కథ అని అతడు గతంలోనే చెప్పాడు. ప్రపంచంలో తొలి నగరం కాశీనే తాము కలియుగం అంతమయ్యే సమయంలో చివరి నగరంగానూ ఊహించుకొని రాసుకున్న కథే ఈ సినిమా అని తెలిపాడు. కల్కి 2898 ఏడీ మూవీ మొత్తం కాశీ, కాంప్లెక్స్, శంబాలా ప్రపంచాల చుట్టూ రాసుకుందని... ప్రపంచంలో చిట్టచివరి నగరం కాశీ మూడు వేల ఏళ్ల తర్వాత ఎలా ఉండనుంది? అప్పటి మనుషులు, వారి వేషధారణ, వాళ్లు వాడే వాహనాలు, ఆయుధాలు.. ఇలా అన్నింటినీ ఊహించి మూవీ కోసం తయారు చేసినట్లు నాగ్ అశ్విన్ చెప్పాడు. మూడు వేల ఏళ్ల తర్వాత కాశీలో తీవ్ర కరువు కాటకాలు ఉంటాయని, గంగ పూర్తిగా ఎండిపోతుందని, ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి ప్రజలు ఎదుర్కోబోయే దారుణమైన పరిస్థితులను కాశీ ప్రపంచంలో ఊహాజనితంగా చూపించామని చెప్పారు. అయినప్పటికి కల్కి సినిమాకథపై విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో రెండోభాగం కథ ఎలా ఉంటుంది..అదెన్ని విమర్శలు ఎదుర్కొంటుందన్నది చూడాల్సి ఉంది.

అయితే గరికపాటి గతంలో పుష్ప సినిమాపై కూడా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఎర్రచందనం 'స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోని చేశారని.. పైగా హీరో తగ్గేదేలే.. అంటాడని.. స్మగ్లింగ్ చేసే వ్యక్తి ఎవరైనా తగ్గేదేలే.. అంటాడా.. అతడు ఏమైనా హరిశ్చంద్రుడా? ఆ మాట అనటానికి.. సమాజానికి ఏం నేర్పిస్తున్నారు? నాకు ఈ సినిమా డైరెక్టర్, హీరో కనిపిస్తే ఈ విషయమై ప్రశ్నిస్తా..కడిగి పారేస్తా..' అని గరికపాటి తీవ్ర విమర్శలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed