ఆరు నిమిషాల సీన్‌కు రూ. 60 కోట్లా..? పుష్ప 2 షూట్‌పై షాకింగ్ విషయాలు వెలుగులోకి

by sudharani |   ( Updated:2024-04-11 16:12:33.0  )
ఆరు నిమిషాల సీన్‌కు రూ. 60 కోట్లా..? పుష్ప 2 షూట్‌పై షాకింగ్ విషయాలు వెలుగులోకి
X

దిశ, సినిమా: ‘పుష్ప: ది రైజ్’ కు సీక్వెల్‌గా వస్తున్న మూవీ ‘పుష్ప2’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. నేషనల్ క్రష్ రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇందులో అల్లు అర్జున్.. బాడీ పెయింట్‌తో నీలం పట్టు చీర ధరించాడు. తిరుపతిలో గంగమ్మ తల్లి జాతరకు మాతంగి వేషం వేసిన పుష్ప రాజ్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అయితే.. 1 నిమిషం టీజర్ ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉంటే.. నివేదికల ప్రకారం ఈ ఆరు నిమిషాల జాతర సన్నివేశాన్ని చిత్రీకరించడానికి మేకర్స్ రూ. 60 కోట్లు ఖర్చు చేశారట. సీన్‌ని పూర్తి చేయడానికి మేకర్స్ దాదాపు 30 రోజులు పట్టిందట. మొత్తంగా సీన్ కంప్లీట్ చేసి 1 నిమిషం టీజర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంటే షాక్ అవుతున్నారు. 6 నిమిషాల సీన్‌కు రూ. 60 కోట్లు ఖర్చు చేశారా అంటూ నోరు వెల్లబెడుతున్నారు. కాగా.. పుష్ప రాజ్‌ని థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.

Advertisement

Next Story