- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నువ్వు నా వాడివి అని చెప్పుకునేందుకు ఎంతో గర్వపడుతున్నా.. అనుష్క ఎమోషనల్ కామెంట్స్
దిశ, సినిమా: 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో శనివారం ఇండియా, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ ఎన్నో నాటకీయ మలుపులు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేపుతూ చివరికి టీమిండియా విజయం సాధించింది. అద్భుత విజయంతో టీమిండియా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్ని తాకాయి. అయితే భారత్ విజయం సాధించడం పట్ల పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ టీమిండియాకు అభినందనలు తెలుపుతున్నారు. ఇక ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా కోహ్లీని ఫ్యాన్స్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కాగా అంతర్జాతీయ టీ20 లకు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ సతీమణి హీరోయిన్ అనుష్క శర్మ ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. అందులో భాగంగా జాతీయ జెండాను భుజంపై వేసుకొని ట్రోఫిని పట్టుకున్న విరాట్ కోహ్లీ ఫొటోను షేర్ చేస్తూ.. ఈ మనిషిని ఎంతో ప్రేమిస్తున్నాను.. నువ్వు నా వాడివి అని చెప్పుకునేందుకు ఎంతో కృతజ్ఞురాలిని.. ఈ క్షణాలను సెలెబ్రెట్ చేసుకోవడానికి నా కోసం మెరిసే నీటిని తీసుకురా అని క్యాప్షన్ జోడించింది.
అదేవిధంగా టీమిండియా ఆటగాళ్లు విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న ఫోటోలు షేర్ చేస్తూ.. ఘన విజయం తర్వాత ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటే నా కూతురు ఆందోళన చెందింది. వారిని దగ్గరకు తీసుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుండు అనుకుంది. అవును నా డార్లింగ్.. వారిని 150 కోట్ల మంది కౌగిలించుకున్నారు. అద్భుతమైన విజయం.. ఛాంపియన్స్ అంటూ కామెంట్ చేసింది.