నా పనిని అందరూ ఇష్టపడాలని ఎన్నడూ ఆశించలేదు: Farhan Akhtar

by Vinod kumar |   ( Updated:2022-12-06 12:47:10.0  )
నా పనిని అందరూ ఇష్టపడాలని ఎన్నడూ ఆశించలేదు: Farhan Akhtar
X

దిశ, సినిమా: బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్, డైరెక్టర్, సింగర్ ఫర్హాన్ అక్తర్.. తను పాడిన పాటలకు మిశ్రమ స్పందన రావడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఏ రంగంలోనైనా ఒకే అంశాన్ని కొంతమంది అమితంగా ఇష్టపడితే మరికొందరూ అస్సలు పట్టించుకోరని, అలాంటివి తన జీవితంలోనూ ఎదుర్కొన్నట్లు తెలిపాడు. అయితే ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఎదురయ్యే ఒడిదుడుకుల వలే ఇష్టాయిష్టాలను కూడా ఒక భాగంగానే భావించాలన్న ఆయన.. 'నేను చేసే పనిని అందరూ ఇష్టపడతారని ఎన్నడూ ఆశించలేదు. ముఖ్యంగా ఈ రోజుల్లో అలాంటి అద్భుతాలు జరగడం లేదు. నా వాయిస్‌ను ఈ తరం పెద్దగా ఇష్టపడట్లేదని తెలుసు. అయినప్పటికీ 48 ఏళ్ల వయసులోనూ నన్ను, నా గొంతును ఆదరించే వ్యక్తులున్నందుకు సంతోషంగా అనిపిస్తోంది. దీంతో మరింత క్రియేటివ్‌గా చేయడంపై దృష్టిపెడతా. నిరంతరం నన్ను నేను మెరుగుపరుచుకుంటా' అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story