ట్విట్టర్‌ను షేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్.. ట్రెండింగ్‌లో పిఠాపురం!

by Jakkula Samataha |
ట్విట్టర్‌ను షేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్.. ట్రెండింగ్‌లో పిఠాపురం!
X

దిశ, సినిమా : ఎన్నికల ఫలితాల సందడి మొదలైంది. అందరి చూపు పిఠాపురం వైపే మళ్ళింది. పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నిక అవుతారని తన ఫ్యాన్స్ చెబుతున్నారు. అంతే కాకుండా ఎగ్జిట్ పోల్స్ కూడా ఆయనే ఎమ్మెల్యే అని తేల్చి చెప్పాయి. దీంతో ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నాడని ఆయన అభిమానులు ఆనందంలో మునిగి పోయారు. మరీ ముఖ్యంగా ఈరోజు ఫలితాలు వెల్లడి కాబోతున్న నేపథ్యంలో వారు చేసే సందడి మాములుగా లేదు.

వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన జనసేనాని పేరు మారు మోగిపోతుంది. జనసేనాని ఎలక్షన్స్ ప్రయాణం వీడియోస్ షేర్ చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. అంతే కాకుండా ఆయన ప్రచారంలో చేసిన వాగ్దానాలు, మాట్లాడిన మాటలు, వాటన్నింటిని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వీడియోల రూపంలో షేర్ చేస్తున్నారు అంతే కాకుండా .. మి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా అంటూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి వాటిని వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. మీ పిఠాపురం ఎమ్మెల్యేక హవా..పిఠాపురం ఎమ్మెల్యే అభిమాని.. పవన్ రియల్ హీరో..ఫైనల్లీ ఆయన గెలిచాడు అంటూ అంటూ అనేక పోస్ట్‌లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.



Next Story