- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జయసుధని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నా.. అందుకే లిప్ కిస్ తప్పు అనిపించలేదు: ఆమని షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: సీనియర్ నటి ఆమని అందరికీ సుపరిచితమే. ఆమె అనేక సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అంతే కాకుండా సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ వెండితెరపై పలు సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.
ఈ క్రమంలోనే ఆమె నటించిన ‘చందమామ కథలు’ అనే మూవీలో నరేష్‌తో లిప్ లాక్ సీన్ చేశారు. దీనిపై ఆమె తాజాగా స్పందించారు. అంతే కాకుండా అప్పటి రోజుల్లో హీరోలకు, డైరెక్టర్లకు, ఇప్పుడు ఉన్న వారికి తేడా ఏంటి అనేది ఆమె మాటల్లో చెప్పారు. షూటింగ్ లో టెక్నికల్ పరంగా వస్తున్న మార్పుల వల్ల ఆర్టిస్టులు, డైరెక్టర్లు కూడా అజాగ్రత్తగా తయారవుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆమని.అదేవిధంగా హీరోయిన్ గా ఉన్నప్పుడు కూడా నేను బోల్డ్ గా చేశాను. ఫస్ట్ మూవీలో నరేష్ తో చాలా క్లోజ్ గా నటించాను. అందుకే ‘చందమామ కథలు’ మూవీలో లిప్ కిస్ కూడా నాకేం పెద్ద తప్పుగా అనిపించలేదు. ఆర్టిస్ట్గా సందర్భం వచ్చినప్పుడు కచ్చితంగా చేస్తానని చెప్పాను.. చేశాను. అన్నీ తెలిసే సినిమా ఇండస్ట్రీకి వచ్చాను.
ఇది చేయను, అది చేయను అంటే ఇంట్లో కూర్చోవాల్సిందే. కొంతమంది చేయను అన్నా కూడా వాళ్లకు వర్కవుట్ అవుతుంది. కానీ నేను అలా కాదు. జయసుధ నటించిన చాలా సినిమాలు చూసాను. ఆవిడ గ్లామర్ పాత్రల కంటే నేచురల్ క్యారెక్టర్లే ఎక్కువ చేశారు. సహజనటి అని ఆమెకు ఆ పేరు ఊరికే రాలేదు. ఆమెను నేను ఫాలో అవుతాను అని బోల్డ్ పాత్రలు చేయడంపై తన అభిప్రాయం చెప్పుకొచ్చారు ఆమని. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.