- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ram Gopal Varma: గాడిద కూడా సింహం అనుకుంటుంది.. సంచలనంగా మారిన ఆర్జీవీ పోస్ట్..
దిశ, సినిమా: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. శివ సినిమాతో అప్పట్లో సంచలనం సృష్టించిన ఆయన వెరైటీ ఫిల్మ్ మెకింగ్‌తో ట్రెండ్ సెట్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే కొద్ది కాలంపాటు ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా రాణించాడు. గత కొద్ది కాలం నుండి ఎక్కువగా కాంట్రవర్సీ పోస్టులు చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పొలిటికల్, జనరల్ విషయాలపై తనదైన శైలిలో రియాక్ట్ అవుతూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జీవీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయన జీవిత కథ ఆధారంగా వ్యూహం అనే సినిమాను తెరకెక్కించాడు. కానీ జనసేన, టీడీపీ పార్టీలకు తాను వ్యతిరేకం అని ఎన్నో పోస్టుల ద్వారా తెలిపాడు.
అలాగే పలు వివాదాస్పద కామెంట్స్ చేసి పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు కోపం వచ్చేలా ప్రవర్తించాడు. నిత్యం పలు పోస్టులతో వివాదం సృష్టిస్తుంటాడు. తాజాగా, ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా ఓ సంచలన పోస్ట్ పెట్టాడు. ‘‘ఎక్కువ శ్రద్ధ తీసుకుని అటేన్షన్ చూపిస్తే.. గాడిద కూడా సింహం అని అనుకుంటుంది’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అసలు ఆ పోస్ట్ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి చేశాడని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఆర్జీవీ ట్వీట్‌పై నెట్టింట చర్చ మొదలైంది. అలాగే ఆయన చేసిన పోస్ట్ పొలిటికల్ పరంగానే చేశాడని అంటున్నారు.
Read more...
Director Vijay Bhaskar: అది ప్రేమ కాదు ఉన్మాదం: సక్సెస్‌ఫుల్ దర్శకుడు విజయ్‌భాస్కర్
- Tags
- RGV