Erotophobia: ఆ విషయంలో ఆందోళన.. పెళ్లంటేనే భయం.. ‘ఎరోటో ఫోబియా’నే కారణం

by Javid Pasha |
Erotophobia: ఆ విషయంలో ఆందోళన.. పెళ్లంటేనే భయం.. ‘ఎరోటో ఫోబియా’నే కారణం
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగానే ప్రేమ, పెళ్లి, శృంగారం వంటి విషయాలపట్ల మనుషుల్లో ఆసక్తి ఉంటుంది. క్లోజ్ ఫ్రెండ్స్, కొలీగ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా చర్చకు వస్తుంటాయి. వాటి గురించి డిస్కస్ చేస్తుంటే చాలా మంది ఇంట్రెస్ట్‌గా వింటుంటారు. యువతీ యువకులైతే మరింత క్యూరియాసిటీ ప్రదర్శిస్తుంటారు. అది సహజమైన హ్యూమన్ బిహేవియర్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. కానీ కొందరిలో ఇందుకు భిన్నమైన ప్రవర్తన కనిపిస్తుంది. లవ్, మ్యారేజ్, శృంగారం వంటి మాటలు వింటేనే ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి. ఆందోళన చెందుతారు. దీనినే ‘ఎరోటో ఫోబియా’గా మానసిక నిపుణులు పేర్కొంటున్నారు.

కారణాలు

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎరోటో ఫోబియా బాధితులు అరుదుగానైనా ఉంటున్నారని నిపుణులు చెప్తు్న్నారు. బాధాకరమైన అనుభవాలు, పేదరికం, చిన్నప్పుడు లైంగిక దాడికి గురికావడం, శారీరక వైకల్యాలు, దారుణ సంఘటనలు చూసి చలించిపోవడం, ప్రేమ పేరుతో వేధింపులు, లైంగిక వేధింపులు, సమాజానికి దూరంగా ఉండటం వంటివి ఈ భయానక ఆలోచనలకు, తద్వారా ఎరోటో ఫోబియాకు కారణం అవుతుంటాయి. వాటిపట్ల ప్రతికూల భావన కలిగి ఉన్నందున కనీసం ఆ విషయాలు వినడానికి కూడా బాధితులు ఇష్టపడరు.

లక్షణాలు

ఎరోటోఫోబియా ఉన్నవారు అన్ని విషయాల్లో బాగానే ఉంటారు. లైంగిక పరమైన అంశాల్లోనే ఆందోళన చెందుతారు. ప్రేమ, పెళ్లి, శృంగారం వంటి మాటలు వినడానికి, చర్చించడానికి ఇష్టపడరు. ఎవరైనా మాట్లాడుతుంటే అసౌకర్యంగా ఫీల్ అవుతారు. అక్కడి నుంచి వెళ్లిపోతారు. పెళ్లి చేస్తామని పేరెంట్స్ చెప్తే ఏదో ఒకసాకు చెప్తూ వాయిదా వేస్తుంటారు. ఒకవేళ తల్లిదండ్రులు ఇంకెప్పుడు చేసుకుంటావని ఫోర్స్ చేస్తే సూసైడ్ చేసుకుంటామని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా ఎరోటో ఫోబియా బాధితులు వెనుకాడరు. ఇంకొందరు కాదనలేక పెళ్లి చేసుకున్నప్పటికీ ఆతర్వాత భాగస్వామితో శృంగారంలో పాల్గొనే సమయానికి భయపడి విరమించుకుంటారు. దీంతో వారి రిలేషన్‌షిప్ విడాకులకు దారితీసే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

పరిష్కారం..

ఎరోటో ఫోబియా మనసులో పాతుకుపోయిన బలమైన ప్రతికూల ఆలోచనలు, భయాల కారణంగా ఏర్పడుతుంది. కాబట్టి వాటిని పొగోట్టే పరిస్థితులు క్రియేట్ అవడం లేదా చేయడం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు. అలాగే ప్రేమ, పెళ్లి, శృంగారం వంటి విషయాలపట్ల భయాన్ని పోగొట్టడానికి పెద్దలు, తల్లిదండ్రులు, నిపుణుల కౌన్సెలింగ్ సెషన్లు కూడా ఉపయోగపడతాయి. అలాగే జీవితంలో పెళ్లి, శృంగారం వంటి అంశాల ప్రాధాన్యతను, అవసరాన్ని వివరించే థెరపీల ద్వారా మానసిక నిపుణులు ప్రతికూల ఆలోచనలు పోగొడతారు. ఆత్మీయులైన మోటివేషన్ ద్వారా కూడా ఎరోఫోబియా నుంచి బయటపడే చాన్స్ ఉంటుంది.

ఆలోచనల్లో మార్పు

కొన్నిసార్లు లైంగిక విషయాలు, శృంగారం పట్ల ఉన్న భయాలు, వ్యతిరేక ఆలోచనలు పోగొట్టడంలో సొంత ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని సైకాలజిస్టులు అంటున్నారు. ప్రశాంతంగా కూర్చొని జీవితంలో అవి చాలా ముఖ్యమైనవని, ప్రతి ఒక్కరికీ అవసరం అని, వాటివల్లే ఆనందంగా ఉంటామని మనస్సులో అనుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు. శృంగారం వల్ల, పెళ్లి చేసుకోవడంవల్ల ప్రజలు సంతోషంగా ఉంటున్నారనేందుకు సమాజంలో, పుస్తకాల్లో, సినిమాల్లో అనేక ఉదాహరణలు, సన్నివేశాలు, సందర్భాలు కూడా ఉంటాయి. వాటిపై ఫోకస్ చేయడం కూడా మేలు చేస్తుంది. అలా సాధ్యం కానప్పుడు మానసిక నిపుణులు కాగ్నెటివ్ బిహేవియర్ థెరపీల ద్వారా ఎరోటోఫోబియాను శాశ్వతంగా పోగొడతారు.

Advertisement

Next Story

Most Viewed