- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఓ కొడుకు ఇద్దరు తండ్రుల మధ్య ఎమోషనల్ రైడ్.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘మా నాన్న సూపర్ హీరో’ ట్రైలర్
దిశ, సినిమా: సుధీర్ బాబు అప్ కమింగ్ మూవీ ‘మా నాన్న సూపర్ హీరో’. ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని CAM ఎంటర్టైన్మెంట్తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకోగా.. రీసెంట్గా రిలీజైన టీజర్‌కు విశేష స్పందన లభించింది. ఇదే జోష్‌తో ఇప్పుడు ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం.
‘ఒకప్పుడు ఈ డబ్బు అవసరమే నా కొడుకుని నాకు దూరం చేసింది.. దాని విలువ 25 సంవత్సరాలు’ అంటూ ఓ తండ్రి ఎమోషనల్ డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్లో ‘పైసలు కోసం కొడుకునే కుదవ పెట్టాడు క్యాన్సర్ అని చెప్పి.. ఇన్ని అబద్ధాలు చెప్తారా డబ్బు కోసం’ అని ఓ వ్యక్తి అనగా.. ‘నాన్న కంటే డబ్బు ఎక్కువ కాదు’ అని చెప్పే కొడుకు ఎమోషనల్ డైలాగ్ వరకు ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఆకట్టుకుంటోంది. అలాగే ప్రతి సీన్ ఎంతో సెంటిమెంట్‌గా కళ్లంట నీళ్లు తెప్పించే విధంగా ఉంది. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఓ కొడుకు ఇద్దరు తండ్రుల మధ్య జరిగే (తండ్రి ప్రేమ కోసం కొడుకు.. కొడుకు ప్రేమ కోసం తండ్రి) ఎమోషనల్ పోరాటం అని తెలుస్తోంది. ప్రజెంట్ ఈ ట్రైలర్ నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది.