పోర్న్ సినిమాల్లో నటించమని ఫోర్స్ చేశారు.. నటుడి సంచలన కామెంట్స్

by Sujitha Rachapalli |
పోర్న్ సినిమాల్లో నటించమని ఫోర్స్ చేశారు.. నటుడి సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: ప్రైమ్ ఒరిజినల్ 'పంచాయత్' సూపర్ సక్సెస్ అయింది. జితేంద్ర కుమార్, నీనా గుప్తా ప్రధాన పాత్రల్లో వచ్చిన సిరీస్.. భూషణ్ గా నటించిన దుర్గేశ్ కుమార్ కు బ్రేక్ ఇచ్చింది. అయితే ఇందుకోసం చాలా కష్టపడ్డానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కాస్టింగ్ డైరెక్టర్ల తలుపు కొట్టి.. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని వారి కాళ్ల మీద పడేవాడినని తెలిపాడు. దాదాపు 12 ఏళ్లపాటు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించానని.. ఈ సమయంలో రెండు సార్లు డిప్రెషన్ కు లోనయ్యానని చెప్పుకొచ్చాడు. నటుడిగా మారాలనుకునే ముందు మెంటల్, ఫిజికల్, ఫైనాన్షియల్ గా ఎలా ఉన్నా ఓకే అనుకుని ఫిక్స్ అయిపోవాలన్న ఆయన.. ఇండస్ట్రీలో కెరీర్ ఎంచుకోకపోవడమే బెటర్ అని సలహా ఇచ్చాడు.

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో మనోజ్ భాజ్ పాయ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ తన సీనియర్స్ అని.. వారి వారి బ్యాచ్ ల్లో 20 మంది ఉన్న కేవలం వీళ్లు మాత్రమే సక్సెస్ అయ్యారని తెలిపాడు. ఇక 2013-2022 వరకు కాస్టింగ్ కు వెళ్లిన అవకాశాలు రాలేదన్న ఆయన.. సాప్ట్ పోర్న్ సినిమాలు చేయమని ఒత్తిడి చేశారని, తను ఉన్న పరిస్థితుల్లో మనీ కోసం చేయక తప్పలేదని ఒప్పుకున్నాడు. కాగా ' హైవే ' , ' సుల్తాన్ ' , ' ఫ్రీకి ఆలీ ' లాంటి సినిమాల్లో చేశాక కూడా ఛాన్స్ ల కోసం ఇలాంటి బాధలు పడ్డానని వివరించాడు.

Advertisement

Next Story

Most Viewed