అలాంటి సాహసాలు చేయడం నా వల్ల కాదు.. ద్రష్టి

by sudharani |   ( Updated:2022-08-13 14:15:40.0  )
అలాంటి సాహసాలు చేయడం నా వల్ల కాదు.. ద్రష్టి
X

దిశ, సినిమా : పర్సనల్ లైఫ్ విషయాల పట్ల గోప్యత పాటించే నటీమణుల్లో ద్రష్టి ధామి ఒకరు. ఈ బ్యూటీ తనకు సంబంధించి గుడ్, బ్యాడ్.. ఏ విషయాన్నీ బహిరంగపరిచేందుకు ఇష్టపడకపోదు. ఇదే క్రమంలో పలు రియాలిటీ షోస్ రిజెక్ట్ చేసి అభిమానులకు షాకిచ్చింది. అయితే తాజాగా తన పర్సనల్ ఎజెండా గురించి ఓపెన్ అయిన నటి.. 'మనకు తెలియని వ్యక్తులతో కలిసి జీవించడానికి చాలా ధైర్యం కావాలి. అలా చేయడానికి నాకు బ్యాండ్‌విడ్త్ ఉందని నేను అనుకోను.

నేను సెలవులపై ఎక్కడికి వెళ్లినా పబ్లిక్‌గా తిరిగేందుకు ఇష్టపడను. అందుకే 'బిగ్ బాస్', 'ఖత్రోన్ కే ఖిలాడీ' వంటి రియాలిటీ షోస్ రిజెక్ట్ చేశాను. ముఖ్యంగా ఇలాంటి షోస్‌లో సాహసాలు చేయడానికి భయపడతాను. పైన పాకుతున్న సరీసృపాలతో వ్యవహరించడం నా వల్ల కాదు. అలాంటి స్టంట్ చేయలేను' అంటూ వివరించింది. ఇక సరైన కారణంతోనే ఆఫర్లను తిరస్కరిస్తానన్న ద్రష్టి.. నిరుత్సాహపడుతున్న అభిమానులను అలరించడానికి సరికొత్త కంటెంట్ ఎంచుకుంటున్నట్లు తెలిపింది.

అర్ధరాత్రి నిద్రలేపి సింగిల్ షాట్ కావాలన్నాడు.. ఇవ్వక తప్పలేదన్న అర్చిత

Advertisement

Next Story

Most Viewed