ప్రముఖ సింగర్ వాణీజయరాం మృతిపై అనుమానాలు

by GSrikanth |   ( Updated:2023-02-04 12:57:15.0  )
ప్రముఖ సింగర్ వాణీజయరాం మృతిపై అనుమానాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ సింగర్ వాణీజయరాం శనివారం మరణించారు. అయితే ఆమె మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తలకు తీవ్ర గాయాలై రక్తంతో ఉన్న వాణీజయరాం అనుమానస్పద మృతిపై చెన్నైలోని త్రిబుల్ కేన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈరోజు 11 గంటల‌ ప్రాంతంలో వాణీజయరాం ఇంటికి వచ్చిన పని మనిషి ఎంత సేపు తలపు కొట్టినా తెరవకపోవడంతో చుట్టుపక్కల వాళ్ళతో కలిసి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్ళగా వాణీజయరాం రక్తం మడుగులో కింద పడిపోయి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించి, ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్ళారు.

కానీ, అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆమెపై ఎవరో దాడి చేసినట్టు ఉందని పనిమనిషి మీడియాతో సహా పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆమె మరణానికి కారణం ఏమై ఉంటుందని పోలీసులు విచారిస్తున్నారు. ఎవరైనా దాడి చేశారా లేక ఆమె కిందపడి గాయాలయ్యాయా? అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. సీసీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. అయితే కాలు జారి కిందపడి తలకు గాయమయ్యి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాణీజయరాం ఇంటికి ఫోరెన్సిక్‌ నిపుణులు చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. కాగా, వాణీజయరాం పార్థివదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒమేదురార్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

READ MORE

మహేష్ ఫ్యాన్స్‌కు పండగే.. 'SSMB 28' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్

Advertisement

Next Story