- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మన గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను అవమానించకండి.. ఫ్యాన్స్‌కు దండం పెట్టి వేడుకున్న కృష్ణ వంశీ (ట్వీట్)
దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా క్లాసిక్ హిట్ మురారి సినిమా రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీని కృష్ణవంశీ తెరకెక్కించగా.. సోనాలి బింద్రే హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ మురారి చిత్రాన్ని మళ్లీ మళ్లీ చూస్తూ థియేటర్స్‌లో చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. అయితే ఇటీవల ఓ జంట మురారి సినిమా చూస్తూ పెళ్లి సీన్ వస్తుండగా.. థియేటర్‌లో వారు కూడా వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో అంతా పలు రకాలుగా కామెంట్లు పెట్టారు. ఈ క్రమంలో.. ఓ నెటిజన్ ఏకంగా.. డైరెక్టర్ కృష్ణవంశీని ట్యాగ్ చేసి ‘ఇది చూశారా అని వీడియో పెట్టి మరీ అడిగాడు. తాజాగా, దీనిపై కృష్ణవంశీ స్పందించాడు. ‘‘ ఇది కరెక్ట్ కాదు. మన గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను అపహాస్యం చేయడం, అవమానించడం చేయకండి ప్లీజ్ అని దండం పెట్టాడు. ఇక ఈ పోస్ట్ చూసిన కొందరు ఆయనకు సపోర్ట్‌గా నిలుస్తుంటే.. మరికొందరు మాత్రం వాళ్లకి పెళ్లి జరిగిపోయింది.. అది సరదాగానే చేశారు అని కామెంట్లు పెడుతున్నారు.
Not good ... Dnt ridicule n insult n abuse our great grand CULTURE and TRADITIONS plzzzzz ,🙏🙏🙏🙏 https://t.co/CoTJ0tkX3c
— Krishna Vamsi (@director_kv) August 10, 2024
- Tags
- Krishna Vamsi