- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రోడ్డుపై టిఫిన్ బండి నడుపుతున్న బుల్లితెర నటి.. ఎవరో గుర్తు పట్టారా..?
దిశ, సినిమా: సినిమాలో నటించాలని చాలామందికి కోరిక ఉంటుంది, కానీ చాలామంది ఆ కోరికను నేరవేర్చుకోలేకపోతున్నారు. కొంతమంది టాలెంట్ ఉన్న అవకాశాలు రాక, మరి కొంతమంది వెళ్లే మార్గం తెలియక వెనుదిరుగుతున్నారు. అయితే ఒక టిఫిన్ బండి నడుపుతున్న మహిళ, గతంలో టీవీ ఛానల్లో యాంకర్‌గా, సీరియల్లో యాక్టర్‌గా సినిమాలలో తల్లిగా ఇలా పలు రకాల క్యారెక్టర్లలో నటించింది. ఆమెది ఎక్కడో కాదు నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ పట్టణం. ఆమె పేరు ఝాన్సీ.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు విషయాలను తెలిపింది.. ముఖ్యంగా తాను చిన్న వయసులో ఉన్నప్పుడే తన ఇంటికి ఇరుపక్కల రామకృష్ణ థియేటర్, వెంకటేశ్వర థియేటర్లు ఉండేవి. ఆ థియేటర్ నుంచి వచ్చే సౌండ్స్ విన్నప్పుడల్లా తను కూడా సినిమాల్లో నటించాలని కోరిక ఉండేదని.. తనని తాను స్క్రీన్ మీద చూసుకోవాలని ఆశ కలుగుతూ ఉండేదని తెలిపారు. అలా డబ్ స్మాస్ ,టిక్ టాక్ వంటి యాప్‌ల ద్వారా యాక్టింగ్‌ని ప్రాక్టీస్ చేశానని తెలిపింది. ఇక ఆ వీడియోలు చూసిన తన కుటుంబ సభ్యులు స్నేహితులు సైతం తనని బాగా ఎంకరేజ్ చేసే వారిని తెలియజేసింది.
తర్వాత మ్యారేజ్ అయి ఒక కొడుకు పుట్టిన తర్వాత కూడా అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉండడం వల్ల టీవీ సీరియల్స్‌లో నటించే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయని తెలిపారు. అలా ఆరోజు నుండి ఈరోజు వరకు తాను చాలా సీరియల్స్‌లో నటించానని తెలిపింది. వాటిలో గృహప్రవేశం, నిన్నే పెళ్ళాడుతా, గుప్పెడంత మనసు, నాలుగు స్తంభాలాట, రాధమ్మ కూతురు సీరియల్స్‌లో నటించాను. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రేమ విమానం, లగ్గం, ట్రెండింగ్ లవ్ స్టోరీ. అలాగే రామ్ చరణ్ హీరోగా చేస్తున్న గేమ్ ఛేంజర్‌లో కూడా నటిస్తున్న అంటూ చెప్పుకొచ్చింది. కాగా యాక్టింగ్ చేస్తూనే ఇప్పటికీ టిఫిన్ బండి నడుపుతున్నట్లు చెప్పుకొచ్చింది నటి ఝాన్సీ.