- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బైకు అదుపుతప్పి కిందపడి యువకుడు దుర్మరణం
by Sridhar Babu |
X
దిశ, చేగుంట : వేగంగా బైక్ నడపగా అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన పోలంపల్లి గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వెల్దుర్తి మండలం బండమీదిపల్లి గ్రామానికి చెందిన గంపల గూనయ్య(28)కు రుక్మాపూర్ గ్రామానికి చెందిన మేకల మున్నితో వివాహం అయింది. దాంతో ఇల్లరికం అల్లుడుగా ఉంటున్నాడు. శంకరంపేట మండలం చందంపేట గ్రామంలోని ఎంఎస్ఎన్ కంపెనీలో కూలిపని చేస్తూ ప్రతిరోజూ బైక్ పై వెళ్లి వస్తున్నాడు. శనివారం సాయంత్రం బైక్ పై వెళ్తూ పోలంపల్లి గ్రామ శివారులోని బ్రిడ్జి వద్ద అదుపుతప్పి రోడ్డుపై పడిపోగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి గంపల బాలమని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
- Tags
- young man died
Next Story