MP Chamala: మీ నాయన ఫామ్‌హౌస్‌ ముందు చేయు ధర్నా.. ఎంపీ చామల హాట్ కామెంట్స్

by Ramesh N |   ( Updated:2025-01-03 06:50:02.0  )
MP Chamala: మీ నాయన ఫామ్‌హౌస్‌ ముందు చేయు ధర్నా.. ఎంపీ చామల హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీల కోసం కవిత ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ ధర్నా కార్యక్రమంపై ఇవాళ ఎంపీ చామల కిరణ్ ఒక ప్రకటనలో స్పందించారు. పదేళ్ల పాలనలో ధర్నాలే చేయనివ్వకుండా బీసీలను విస్మరించిన ఘనత (BRS) బీఆర్ఎస్ పార్టీది అని మండిపడ్డారు. బీసీల నినాదం ఎత్తుకోని ధర్నా చౌక్‌లో ఎమ్మెల్సీ కవిత ధర్నా చేయడం నవ్వు వస్తోందని విమర్శించారు. (Congress) కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కులగణన చేసేదే బీసీల కోసమని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కాదు.. కులగణన సర్వేలో వచ్చే శాతాన్ని అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని దేశంలోనే మొదటి సారిగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేపట్టిందన్నారు. తన నిరసన వల్లే రిజర్వేషన్లు వచ్చాయని చెప్పుకోడానికి ఆమె ధర్నా చేపట్టిందని, కానీ వారి పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. ధర్నా చేయాలనుకుంటే ధర్నాచౌక్‌లో కాదు.. మీ నాయన ఫామ్‌హౌస్‌ ముందు చేయు అని మండిపడ్డారు. మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీ అధ్యక్షుడిగా బీసీని ప్రకటించండి.. అంటూ సవాల్ చేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) అయినా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దైనా కాంగ్రెస్ పార్టీది ఒకటే నిర్ణయం ఉంటుందని, వీలైతే కులగణనలో భాగస్వాములై సహకరించండని హితువు పలికారు.

Advertisement

Next Story

Most Viewed