న్యూయర్ వేడుకల్లో నీతా అంబానీ వేసుకున్న లాంగ్ ఫ్రాక్ ఖరీదెంతో తెలిస్తే షాక్

by Anjali |
న్యూయర్ వేడుకల్లో నీతా అంబానీ వేసుకున్న లాంగ్ ఫ్రాక్ ఖరీదెంతో తెలిస్తే షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్ నీతా అంబానీ(Chairman of Reliance Foundation Nita Ambani ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అరవై ఏళ్ల వయసులో కూడా ఈమె అద్భుతమైన ఫ్యాషన్‌ సెన్స్‌ను చూపిస్తూ సోషల్ మీడియాలో తరచూ హైలెట్ అవుతుంటుంది. నీతా అంబానీ వాడే బ్యాగ్, వేసుకునే బ్యాంగిల్స్(Bangles), డ్రెస్సెస్(dresses).. ఇలా ప్రతి ఒక్కదానిపై, వాటి ధరల గురించి జనాలకు ఆసక్తి ఉంటుంది. అయితే కొత్త సంవత్సరం వేళ (జనవరి1, 2025) నీతా అంబానీ అండ్ తన క్లోజ్ ఫ్రెండ్స్ కలిసి న్యూయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ పార్టీలో నీతా అంబానీ చాలా అట్రాక్టివ్‌గా నిలిచింది.

తను ధరించిన డ్రెస్, చెవి జుంకాలు.. అక్కడున్న వారందరిని ఆకట్టుకున్నాయి. నీతా చాలా డిఫరెంట్‌గా గోల్డెన్ కఫ్తాన్ గౌన్‌ను ధరించి.. ఎంతో అందంగా ఉంది. న్యూయర్ లుక్ నిజంగా ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. ఇది సాధారణ గౌన్ కంటే చాలా డిఫరెంట్‌గా ఉంది. ముదురు బూడిద కలర్‌లో కఫ్తాన్ గౌన్(Kaftan gown) స్టైల్‌గా, కంఫార్ట్ గా ఉంది. అయితే ఈ గౌనును విలాసవంతమైన మస్లీన్ ఫ్యాబ్రిక్‌(Muslin fabric)తో రెడీ చేశారట. అయితే నీతా అంబానీ వేసుకున్న డ్రెస్ ఖరీదెంత అని జనాలు వెతకడం ప్రారంభించారు. ఈ కఫ్తాన్ గౌన్ ధర 1, 797 డాలర్లు.. అంటే 1. 54 లక్షల రూపాయలట.

Advertisement

Next Story

Most Viewed