- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
దిశ, గుమ్మడిదల : బాలానగర్ మెదక్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గుమ్మడిదల మండల పరిధిలోని నల్లవల్లి అడవి శివారు.. బాలానగర్ మెదక్ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం సమయంలో నర్సాపూర్ వైపు నుంచి వస్తున్న షిఫ్ట్ కారు దాని ఎదురుగా ప్రయాణిస్తున్న ఆటోను, బాలానగర్ వైపు నుండి నర్సాపూర్ వస్తున్న మరో ఆటోను అతివేగంతో ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ కి చెందిన మనీషా, మెదక్ జిల్లా రుస్తుం పేటకు చెందిన దూది ఐశ్వర్య, కుత్బుల్లాపూర్ సూరారం కు చెందిన మరో వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. మరో ఐదుగురికి తీవ్రంగా గాయాలు అవడంతో నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న గుమ్మడిదల పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.