Sex & Science: శృంగారం - శరీర రసాయనాల్లో మార్పులు

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-10-09 15:57:35.0  )
Sex & Science: శృంగారం - శరీర రసాయనాల్లో మార్పులు
X

నసుకు, శరీరానికి ఉత్తేజాన్ని, ఉద్వేగాల్ని, ఆనందాన్ని ఇవ్వటంలో 'హార్మోన్లు' కీలక పాత్ర పోషిస్తాయి. వివిధ భావోద్వేగాలకు అనుగుణంగా ఇవి విడుదలవుతుంటాయి. అంతేకాదు, నిరాశా, నిస్పృహలు, బాధ, కోపం, చిరాకు, ఆందోళన వంటి ప్రతికూల భావోద్వేగాలను కూడా ఇవి కలిగిస్తాయి. అలాగే గ్రంథులు తమ రసాయనిక స్రావాలతో శరీరంలోని వివిధ జీవన క్రియలలో సమతుల్యం దెబ్బ తినకుండా చూస్తాయి. ఉదాహరణకు గుండె కొట్టుకునే పద్ధతి, లయ, శ్వాసక్రియ, జీర్ణక్రియలు, ప్రత్యుత్పత్తి రసాయన పదార్థాల మీదే ఆధారపడి ఉంటాయి. అలాగే, స్త్రీ పురుషుల మీద పరస్పరం ఒకరిపై ఒకరికి ప్రేమ, శృంగార వాంఛ లాంటి భావనలు కలగడానికి కారణం వాటికి ఉత్తేజకాలుగా, ప్రేరకాలుగా పని చేసే హార్మోన్లు మాత్రమే. ప్రేమ, ద్వేషం, శృంగార వాంఛ, కోరిక వీటన్నింటికీ జీవ రసాయన శాస్త్రంలో హేతుబద్దమైన కారణాలు ఉంటాయి.

శృంగారోద్దీపనలకు మూలమైన హార్మోన్లుగా 'ఫీనైల్ ఇథైల్ అమైన్', 'ఆక్సిటోసిన్', 'డై హైడ్రో ఇథియోండ్రోస్టిరాన్', 'ఈస్ట్రోజన్', 'ప్రోజెస్టిరాన్', 'ప్రొలాక్టిన్', 'వాసోప్రెసిన్ లను పేర్కొంటారు.

ఈస్ట్రోజన్ :

ఈ హార్మోన్ స్త్రీలలో శృంగారం పట్ల ఆసక్తిని, కోరికను పెంచుతుంది. వీటిని 'స్టెరాయిడల్ సెక్స్ హార్మోన్' అనీ అంటారు. ఇవి అండాశయంలో ఎక్కువగా విడుదల అవుతాయి. గర్భస్థ స్థితిలో ప్లాసెంటాతో అడ్రినల్ గ్రంథిలో, తక్కువ శాతం పురుషుల వృషణాల్లోనూ విడుదలవుతాయి. స్త్రీలలో ఈస్ట్రోజన్ కౌమారదశలో సెకండరీ లైంగిక లక్షణాలు, లైంగిక అవయవాల నిర్మాణాభివృద్ధికి తోడ్పడతాయి. ఉదా: వక్షోజాలు, లైంగిక అవయవాల చుట్టూ వెంట్రుకలు రావడం, చర్మం కింద కొవ్వు పేరుకుని చర్మం, నున్నగా కాంతివంతంగా తయారవడం వంటివి దీనివల్లే సాధ్యం. స్త్రీలలో ఈ హార్మోన్ ఎక్కువగా స్రవించడం వల్ల లైంగికోత్తేజం కూడా ఎక్కువ జరుగుతుంది. పురుషులలో ఈస్ట్రోజన్ ఎక్కువగా విడుదల అయితే వక్షోజాలు పెరగడం అనే 'గైనకోమాస్టియా' స్థితికి దారితీస్తుంది. ఈస్ట్రోజన్ హార్మోన్‌ను గర్భనిరోధక మాత్రలలో విరివిగా ప్రోజెస్టిరాన్ హార్మోన్‌తో కలిపి వాడతారు. అలాగే, వీటిని ప్రోస్టేట్ కేన్సర్ చికిత్సలో వాడతారు.

ప్రోజెస్టిరాన్:

స్త్రీలలో ఈ హార్మోన్లు గర్భాశయంలో పిండం పెరిగేందుకు అనువుగా గర్భాశయ గోడలను సిద్ధం చేస్తాయి. గర్భధారణ సమయంలో అండం విడుదలను అవుతాయి. ప్రసవమైన తర్వాత పాలు సమృద్ధిగా రావడానికి రొమ్ములోని కణజాలం, గ్రంథుల్లో అనుకూలైన మార్పులు తీసుకురావడానికి ఇవి తోడ్పడుతాయి. ఈ హార్మోన్ల స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో పురుష శృంగార హార్మోన్ (టెస్టోస్టిరాన్) స్థాయి తగ్గి పోయి శృంగార పరమైన కోరికలు తగ్గుతాయి. పురుషులలో వికృత లైంగిక పోకడలు, లైంగిక అత్యాచారాలు చేసే వాళ్ళు, చిన్న పిల్లలపై లైంగిక అత్యాచారాలు చేసేవాళ్ళు అంటే 'ఫీడోఫీలియాలు' వంటి వారికి చికిత్సగా ఈ హార్మోన్లను ఇంజెక్షన్ల రూపంలో ఇస్తారు. అప్పుడు వీరిలోని విపరీత సెక్స్ కోరికలు తగ్గుతాయి. ఈ హార్మోన్ల స్థాయి పెరిగితే మరో వైపు శరీరంలో శృంగార భావాలను రెచ్చగొట్టే పరిమళాలు తగ్గిపోతాయి. స్త్రీల గర్భ నిరోధక మాత్రలలో వీటిని ఎక్కువగా వాడతారు. ప్రోజెస్టిరాన్ హార్మోన్ల స్థాయి ఎక్కువవడం వల్ల వ్యతిరేక భావోద్వేగాలైన కోపం, చిరాకు, ఉద్రేకం, ఆందోళన, ఒత్తిడి అధికమవుతాయి. స్త్రీలలో రుతుక్రమం మొదలయ్యే ముందు వచ్చే డిప్రెషన్, కోపం, ఉద్రేకం, దుఃఖం లాంటి ఉద్వేగాలకు ఈ హార్మోన్ల సమతుల్య లోపమే కారణం.

ఆక్సిటోసిన్ :

మనుషుల్లో ప్రేమ, ఆప్యాయతలను, అనురాగాలను పెంచే హార్మోన్ ఇది. ఆక్సిటోసిన్ స్పర్శకు సంబంధించిన హార్మోన్, ఎవరైనా ప్రేమతో మనల్ని స్పర్శించినప్పుడు ఈ హార్మోన్ విడుదలై మనలో అనుకూల భావోద్వేగాల్ని కలిగించి, బంధాన్ని పటిష్టం చేస్తుంది. ఆక్సిటోసిన్ హార్మోన్ మెదడులోని పిట్యుటరీ గ్రంథి వెనుక తమ్మెనుండి విడుదలవుతుంది. స్త్రీలలో ఇది ప్రసవ సమయంలో గర్భాశయంలోని కండరాలను సంకోచింపజేస్తూ గర్భంలోని పిండాన్ని బయటకు నెట్టే ప్రయత్నం అవడానికి చేయడంతో పాటుగా బిడ్డకు పాలు ఉత్పత్తి అవడానికి దోహదం చేస్తుంది. అలాగే, శృంగారవేళ స్త్రీ భావప్రాప్తి పొందినప్పుడు గర్భాశయ కండరాలు వేగంగా సంకోచిస్తాయి. దీనికి కారణం ఆక్సిటోసిన్ హార్మోన్ ప్రభావమే.

అంతేకాదు, ఆందోళన, ఒత్తిడిలను దూరం చేసి కుటుంబసభ్యుల మద్య ముఖ్యంగా భార్యాభర్తల నడుమ దాంపత్య, సహజీవన అనుభూతుల్ని పై హార్మోన్ మెరుగుపరుస్తుంది. మరోవైపు దీని స్థాయి ఎక్కువగా ఉంటే ప్రేమికుల్లో తీవ్రమైన విరహం, భావోద్వేగాలు నెలకొంటాయి. వారిలో ఇహలోక భావన తగ్గిపోతుంది. ఒంటరిగా విరహవేదనతోనే ఉండిపోవాలనుకుంటారు. అలాగే విషయాలను మర్చిపోవడం, గ్రహణశక్తి తగ్గి ఆలోచనలు మందగిస్తాయి. మొత్తానికి ఆక్సిటోసిన్ స్త్రీలలో శృంగారానుభూతుల్ని పెంచుతుందనే చెప్పాలి.

ఫినైల్ ఇథైల్ అమైన్ :

దీన్ని 'రొమాంటిక్ హార్మోన్' లేదా 'లవ్ మాలిక్యూల్' అని కూడా అంటారు. దీనివల్ల మనుషులు ప్రేమలో పడినప్పుడు ఊహల్లో తేలిపోవడం, గాలిలో విహరించిన అనుభూతి వంటివి కలుగుతాయి. ఇది మనుషులు ప్రేమ లోకాల్లో తేలిపోయినప్పుడు, అద్భుత విజయాలు సాధించినప్పుడు, శృంగారంలో భావప్రాప్తిని అనుభూతి చెందుతున్నప్పుడు విడుదల అవుతుంది. లేదా ఇది విడుదలైనప్పుడు అటువంటి అనుభూతులకు లోనవుతారు.

శృంగార సమయంలో దంపతులు తీవ్రస్థాయి ప్రేమోద్వేగంలో ఉన్నప్పుడు చేసిన రక్త పరీక్షల్లో ఈ హార్మోన్ ఎక్కువగా ఉండటాన్ని శాస్త్రజ్ఞులు గమనించారు. పీ కాలరీ (Pea calory అంటే phenile ethyl amine) హై ఎనర్జిటిక్‌గా పనిచేసి ఆకలిని మందగింపజేసి లావు కాకుండా చేస్తుంది. అందుకే, శృంగారం ఒక 'మంచి వ్యాయామం' అంటారు. ఆ సమయంలో స్త్రీ పురుషుల్లో చాలా కేలరీలు తగ్గుతాయి.

- డాక్టర్ భారతి. MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ &సెక్సాలజిస్ట్

Email : askdrbharathi.gmail.కం

Read More..

Sexual life : శృంగారం సమయంలో మీ భర్త మోటుగా ప్రవర్తిస్తున్నాడా...?

Advertisement

Next Story

Most Viewed