గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా? అంటూ బాల‌కృష్ణకు వార్నింగ్ ఇచ్చిన మోక్షజ్ఞ.. ఎందుకో తెలుసా..?

by Anjali |   ( Updated:2023-10-09 09:52:12.0  )
గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా? అంటూ బాల‌కృష్ణకు వార్నింగ్ ఇచ్చిన మోక్షజ్ఞ.. ఎందుకో తెలుసా..?
X

దిశ, సినిమా: నందమూరి బాలయ్య నటించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ మూవీ అక్టోబ‌ర్ 19న రిలీజ్ కానుంది. కాజల్ హీరోయిన్‌ కాగా.. శ్రీలీల ముఖ్యపాత్రలో నటించింది. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ గ్రాండ్‌గా నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు బాల‌కృష్ణ, కాజ‌ల్, శ్రీలీలతోపాటు మూవీ టీం అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య.. ‘ఈ మూవీలో శ్రీలీల నా కుమార్తెగా నటించింది. కానీ నా తర్వాతి సినిమాలో హీరోహీరోయిన్లుగా యాక్ట్ చేద్దామని ఆమెతో చెప్పాను. ఇక ఈ విషయాన్ని ఇంట్లో కూడా చెప్పడంతో.. కొడుకు మోక్షజ్ఞ స్పందన వేరే లెవల్‌లో ఉందని చెప్పుకొచ్చాడు. ‘నేను హీరోగా రాబోతుంటే ఆమెతో నువ్వు ఆఫర్ ఇస్తావా? గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ నీకు అని తిట్టాడు. ఇంకేం మాట్లాడతాను నేను, నాకు వార్నింగ్ ఇచ్చాడు వాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Next Story