Akhil Sarthak ను చీట్ చేసిన గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-07-23 04:12:03.0  )
Akhil Sarthak ను చీట్ చేసిన గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ సార్ధక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న సినిమాలలో నటించి తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఓటీటీ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ షో లో అఖిల్ అడుగుపెట్టి.. అంతకముందు కంటే డిఫరెంట్ యాటిట్యూడ్ చూపించాడు. బుల్లితెరపై ప్రసారమైన బీబీ జోడీలో నటి తేజస్వి మదివాడతో జతకట్టి డాన్స్ తో రచ్చ రచ్చ చేశాడు. వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారంటూ కొన్ని అనుమానాలు కూడా వచ్చాయి. కానీ మా ఇద్దరి మధ్య మంచి స్నేహం మాత్రమే ఉందంటూ పలు ఇంటర్వ్యూ లో అఖిల్ చెప్పుకొచ్చాడు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు. తనకు సంబంధించిన ఫొటోస్ షేర్ చేస్తుంటాడు. అప్పుడప్పుడు తన పర్సనల్ విషయాలు కూడా పంచుకుంటూ ఉంటాడు. అయితే తాజాగా తన ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టి డిలీట్ చేసాడు. ఆ స్టోరీలో తను బాగా కోపంతో మాట్లాడుతూ కనిపించాడు. కొందరు వద్దన్నా కూడా వస్తూనే ఉంటారు.. వద్దన్నా అదే పనిగా మెసేజ్లు చేస్తుంటారు అని.. పైకి ఎంతో ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఉంటారు అని కాని దగ్గరికి వచ్చాక అసలు ఏమీ ఉండదని.. స్టోరీలో రాసుకొచ్చాడు. ఎవరో అమ్మాయిని ఉద్దేశించి పెట్టినట్లు ఉందని , అఖిల్ తన గర్ల్ ఫ్రెండ్ కోసమే ఇలా పెట్టి ఉంటాడని నెటిజెన్స్ అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి :: Allu Arjunపై డైరెక్టర్ మారుతి స్పెషల్ ట్వీట్.. Prabhas ఫ్యాన్స్ ఫైర్ ఎందుకంటే?

Advertisement

Next Story