- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పవన్ కళ్యాణ్- అకిరా నందన్ కలిస్తే ఏం మాట్లాడుకుంటారో తెలుసా..?
దిశ, సినిమా: పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ బద్రి సినిమాలో నటించిన తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. కాగా వీరికి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు రేణు దేశాయ్ దగ్గరే ఉంటుండగా.. పిల్లలకు తండ్రిగా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. విడాకులు అనంతరం పూణే వెళ్లిపోయిన రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో అక్కడే ఉంది.
ఇదిలా ఉండగా గతంలో రేణు దేశాయ్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో పాల్గొన్న ఆమె.. పవన్ కళ్యాణ్‌తో పిల్లలకి ఉండే బాడింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రేణు దేశాయ్ మాట్లాడుతూ... ఆద్య చాలా కమాండింగ్ గా ఉంటుంది. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నువ్వు ఎప్పుడు కలుస్తావు. మమ్మల్ని చూడాలని లేదా... నువ్వు వెంటనే రావాలని గట్టిగా మాట్లాడుతుంది. అకిరా అలా కాదు. ఆద్యతో నేను మరాఠిలో మాట్లాడతాను. తనతో మరాఠీలోనే మాట్లాడాలని ఆద్య కండిషన్ పెట్టింది. అకీరాతో మాత్రం తెలుగులో మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళ నాన్న భాష అకీరా మర్చిపోకూడదు కదా.
అకీరా- పవన్ తెలుగులోనే మాట్లాడుకుంటారు. వాళ్ళు లైఫ్, ఫిలాసఫీ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళ మధ్య సినిమా ప్రస్తావన రావడం నేను ఒక్కసారి కూడా చూడలేదు. నేను కూడా ఆయనతో మాట్లాడతాను. విడాకుల తర్వాత మేము మిత్రులుగా ఉంటున్నాము. ఆద్య వాళ్ళ నాన్నతో మరాఠీలోనే మాట్లాడుతుంది. నా కోసం ఆయన భాష నేర్చుకోలేదు కానీ ఆద్య కోసం మరాఠీ నేర్చుకున్నారు. ఆద్య- పవన్ మరాఠీలో మాట్లాడుకుంటారని చెప్పుకొచ్చారు రేణూ దేశాయ్.
కాగా అకీరా టీనేజ్ దాటేసి హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నటవారసుడిగా అకీరా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.