- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అల్లు అర్జున్ సెంటిమెంట్స్ ఏంటో తెలుసా.. ఆ రెండూ ఉంటే ఆయనకు సక్సెస్ ఖాయమంట!
దిశ, సినిమా : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గంగోత్రి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ హీరో, ఆర్య, బన్నీ, దేశముదురు సినిమాల్తో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక అల్లు అర్జున్ డ్యాన్స్, నటన అంటే చాలా మందికి ఇష్టం. ఇక చిత్ర పరిశ్రమలో చాలా మందికి కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అయితే మన స్టైలిష్ హీరో అల్లు అర్జున్‌కు కూడా రెండు సెంటిమెంట్లు ఉన్నాయంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ మన ఐకాన్ హీరో సెంటిమెంట్స్ ఏంటీ అని ఆలోచిస్తున్నారా?
చాలా మంది సినిమాలను విడుదల చేసే రోజు, నెల, అన్నీ కూడా కలిసి వచ్చే విధంగా ఉన్నాయా లేదా అని చూసుకుంటారు. అదే విధంగా కొంత మంది ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కూడా తమకు ఫేవరేట్ ప్లేస్‌లో చేస్తే కలిసి వస్తుందని కొందరు చెబుతుంటారు. కాగా, బన్నీకి కూడా ఏప్రిల్ నెలలో ఏ సినిమా విడుదల చేసినా అది బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తుందని గట్టిగా నమ్ముతాడంట. ఎందుకంటే ఆ నెలలో రేసు గుర్రం, బన్నీ, వంటి చిత్రాలు విడుదలై మంచి సక్సెస్ అందుకున్నాయి. అలాగే వైజాగ్‌లో గనుక సినిమా చిత్రీకరణ జరిగినట్లైతే ఆ సినిమా సక్సెస్ ఖాయం అని మరో సెంటిమెంట్ కూడా ఉన్నదంట.ఎందుకంటే తాను చేసిన గంగోత్రి, ఆర్య, బన్నీ, దేశముదురు వంటి సినిమాలన్నీ వైజాగ్‌లోనే చిత్రీకరించారు. అవి మంచి విజయం సొంతం చేసుకున్నాయి. ఇలా అల్లు అర్జున్‌కు రెండు సెంటిమెంట్స్ ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.