- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Niharika Konidela : మెగా డాటర్ నిహారిక గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా వారసురాలిగా సినీ రంగంలోకి ప్రవేశించిన ఈ అమ్మడు.. మొదట యాంకర్‌గా మంచి మార్కులు కొట్టేసింది. తర్వాత ‘ముద్దపప్పు ఆవకాయ్’ అనే షార్ట్ ఫిల్మ్‌తో అందరినీ మెప్పించింది. ఇక తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే కోరికతో.. సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. ‘ఓ మనసు’ అనే సినిమాతో వెండితెరపై తన అదృష్టాన్ని పరిక్షించుకునే ప్రయత్నం చేసినప్పటికీ అది అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు.
అనంతరం.. ‘సూర్యకాంతం’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సైరా’ వంటి సినిమాలో నటించింది. అవి కూడా హిట్ టాక్ సాధించలేదు. అయితే.. ‘ఒరు నల్లనాళ్ సొల్జేన్’ అనే సినిమాతో తమిళంలోకి రంగప్రవేశం చేసిన నిహారిక.. అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటూ సినిమాలు చేస్తూనే.. ‘మ్యాడ్ హౌస్’, ‘నాన్న కూచి’ వంటి వెబ్ సిరీస్‌లలో కూడా అలరించింది. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన మెగా డాటర్.. తాజాగా ‘డెడ్ పిక్సెల్స్’ అనే సిరీస్‌తో మళ్లీ ప్రేక్షకులను అలరించింది. ఇక.. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన బ్యూటీ.. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ’, ‘హాలో వరల్డ్’ వెబ్ సిరీస్‌తో ప్రొడ్యూసర్‌గా సూపర్ హిట్ అందుకుంది.
అయితే.. ప్రస్తుతం వెకేషన్లు ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు.. పొట్టి పొట్టి బట్టలతో, హాట్ లుక్స్‌తో సోషల్ మీడియాలో అందాల విందు చేస్తుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా అనేక ట్రోల్స్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ ట్రోల్స్‌కు మొదట్లో బాధపడినప్పటికీ ఇప్పుడు అంతగా పట్టించుకోవడంలేదని తెలిపింది ఈ బ్యూటీ. కాగా.. ఇప్పుడు ఎవరైనా ట్రోల్స్ చేస్తే వాటిని చూసి నవ్వుకుంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మెగా డాటర్. అంతే కాకుండా.. నిహారికపై వచ్చే విమర్శలపై తండ్రి నాగబాబు కూడా సీరియస్‌గా రియాక్ట్ అయ్యేవారు. ఇప్పుడు ఆయన కూడా లైట్ తీసుకోవడం గమనార్హం.
Also Read..