- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లేడీ సూపర్ స్టార్ నయనతార పూర్తి ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
దిశ, సినిమా: సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతున్న స్టార్ హీరోయిన్స్‌లో నయనతార ఒకరు. 2003లో ‘మనసునక్కరే’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నయన్.. 2005లో వచ్చిన ‘గజిని’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలను అందుకుంది. దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇక వివాహం తర్వాత కూడా వరుస ఆఫర్లను దక్కించుకుంటుంది. మొన్నటికి మొన్న బాలీవుడ్ స్టార్ షారుఖ్‌తో జతకట్టి ‘జవాన్’ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఇక నయన్ రెమ్యునరేషన్ విషయం గురించి మాట్లాడుకుంటే.. ఈ ముద్దుగుమ్మ మిగతా హీరోయిన్ల కంటే ఎప్పుడు కూడా టాప్‌లోనే ఉంటుంది. దాదాపు ఒక్కో సినిమాకు రూ. 10 నుంచి 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. దీంతో ఇప్పుడు తన పూర్తి ఆస్తుల విలువ గురించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా ప్రస్తుతం నయనతార మొత్తం ఆస్తుల విలువ ఏకంగా రూ. 183 కోట్లు అని అంచనా. అంతేకాదు ఈ బ్యూటీకి హైదరాబాద్‌లో రెండు ప్రీమియం అపార్ట్‌మెంట్స్ కూడా ఉన్నాయని.. ఇవి 5స్టార్ హోటల్‌కు సమానమైన ఇంటీరియర్‌తో డిజైన్ చేయబడ్డాయని తెలుస్తుంది.