- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేమించిన వ్యక్తికే అమ్మగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : మలయాళీ బ్యూటీ అయిన శ్రీవిద్య అచ్చం తెలుగింటి ఆడపడుచులా ఉంటుంది. ఆమె తెలుగులో ఎన్నో పాత్రల్లో నటించి అభిమానులను కూడగట్టుకుంది. ముఖ్యంగా ఈమె కమలహాసన్‌తో చాలా సినిమాల్లోనే నటించింది. కాగా, తాజాగా ఈమెకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే?
కమలహాసన్‌కు నటుడిగా ఎంతో మంచి పేరు ఉన్నా పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో వివాదాలు ఉన్నాయంట. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఈయనపై ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తుంటాయి. ఎంతో మంది హీరోయిన్స్‌ను ప్రేమించి, వారితో డేటింగ్ చేసి బ్రేకప్ చెప్పే వాడంట. కమల్ హాసన్ ప్రేమించి డేటింగ్ చేసిన హీరోయిన్స్ లిస్టు చాలానే ఉంటుందంట. ఇక ఈ లిస్టులో ఒకప్పటి నటి శ్రీవిద్య ఒకరు.
ఈ నటి కమలహాసన్‌ను ఎంతగా ప్రేమించిందో చాలా మందికి తెలుసు.ఈ విషయంపై శ్రీవిద్య మాట్లాడుతూ..నేను ఆయన్ని ఎంతగానో ప్రేమిస్తే ఆయన మాత్రం మరో అమ్మాయి మోజులో పడడంతో అతన్ని ప్రేమించడం మానేశాను.అయితే కమలహాసన్ తో బ్రేకప్ అయినప్పుడు నాకు మెచ్యూరిటీ లేదు.కానీ క్షమించగలిగే గుణం మాత్రం చాలానే ఉంది.ఎందుకంటే కమలహాసన్ తో బ్రేకప్ అయిన తర్వాత మళ్లీ ఓ సినిమాలో కమల్ హాసన్ కి తల్లిగా నటించే అవకాశం వచ్చింది. నాస్థానంలో ఎవరు ఉన్నా అలా చేయరు.కానీ నాకు క్షమాగుణం ఎక్కువ అందుకే అతన్ని క్షమించి నా ప్రొఫెషన్ ప్రకారం సినిమాలో ఆయనకు తల్లిగా చేశాను. ప్రేమించిన వ్యక్తితోనే అమ్మా అని పిలిపించుకున్నా అంటూ తెలిపింది.
Read More: ఆ విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న స్టార్ డైరెక్టర్