Happy birthday : సింగర్ సునీత జీవితాన్నే మార్చేసిన సాంగ్ ఏదో తెలుసా?

by Jakkula Samataha |   ( Updated:2024-05-10 05:49:30.0  )
Happy birthday : సింగర్ సునీత జీవితాన్నే మార్చేసిన సాంగ్ ఏదో తెలుసా?
X

దిశ, సినిమా : తన గానం వింటే చాలు మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది. తన నవ్వు చూస్తే చాలు.. ఎన్ని బాధలైనా మర్చిపోవచ్చు. ఇక ఆమె స్టేజ్ మీద పాడుతూ నవ్వుతుంటే ఆ క్షణం గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.. తన పాటలతో ఎంతో మందిని ఆకట్టుకొని ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సింగర్ సునీత ఒకరు.

అందరూ ఒక ఎత్తు అయితే, ఈమె ఇంకో ఎత్తు.. తన పాటలు, అందం, స్మైల్‌తో ఈమె అందరినీ ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన గానంతో కట్టు బొట్టుతో చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఇక తన గానంతో ఎంతోమంది సంగీత అభిమానులను సంపాదించుకున్న సునీత పుట్టిన రోజు నేడు. 1978 మే 10న విజయవాడలో జన్మించిన సునీత చిన్న వయసులోనే గాయనీగా కెరీర్‌ ప్రారంభించారు. తన కుటుంబంలోని వారంత సంగీత విద్యాంసులు, కళాకారులు కావడంతో చిన్నతనంలోనే కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. ఇక ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు రావాలి అంటే చాలా సమయం పడుతుంది. కానీ సునీత ఒక్క పాటతోనే స్టార్ సింగర్ రేంజ్‌కు ఎదిగిపోయింది. ఈమె పాడిన పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్.. ఆరోజుల్లో సునీత పాడిన సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎక్కడ చూసినా ఈమె పేరే మారుమోగిపోయింది. సంగీత ప్రియులు అందరూ ఈమె గురించి మాట్లాడుకోవడం, పొగడ్తలతో ముంచెత్తడం జరిగింది. ఇంతకీ సునీత ఏ సినిమాలో తన మొదటి సాంగ్ పాడింది అనుకుంటున్నారా?

సింగర్ సునీత పాడుతా తీయగా తెలుగు సింగింగ్ షోలో పాల్గొని, తన గానంతో ఎస్పీ గారిని ఆకట్టుకున్నారు. అంతే కాకుండా ఆ షోటైమ్‌లో సునీత సాంగ్ కోసం చాలా మంది వేయిట్ చేసేవారంట. ఎందుకంటే అంత ముద్దుగా పాడేది. ఇక ఆ తర్వాత సునీతకు సినిమాల్లో అవకాశం వచ్చింది. ఈ సింగర్ జేడీ చక్రవర్తి, మల్లీశ్వరి నటించిన గులాబి సినిమాలో ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో.. అనే సాంగ్ పాడి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ రోజుల్లో ఇది నెంబర్ వన్ సాంగ్.. దీని తర్వాత సునీత లైఫ్ టర్న్ అయ్యిందనే చెప్పవచ్చు. ఓవ్ నైట్ స్టా్ర్ సింగర్‌గా మారిపోయింది. తర్వాత చాలా ఆఫర్స్ రావడం, అంతే కాకుండా హీరోయిన్స్ వాయిస్ ఓవర్ కూడా అందించారంట.

Advertisement

Next Story