సాయిపల్లవి అసలు పేరు ఏంటో తెలుసా?

by Jakkula Samataha |
సాయిపల్లవి అసలు పేరు ఏంటో తెలుసా?
X

దిశ, సినిమా : ఫిదా సినిమాతో అందరినీ ఫిదా చేసిన హీరోయిన్ సాయిపల్లవి. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తర్వాత వరసగా ఆఫర్స్ అదుకొని, ఎమ్‌సీఏ, శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ, ఇలా చాలా సినిమాల్లో నటించి, తన నటన, డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఈ బ్యూటీ సినిమాల ఎంపిక విషయంలో కూడా ఆచీ తూచి అడుగులు వేస్తుంది. గ్లామర్ పాత్రలు కాకుండా నటనకు ప్రాధన్యత ఉన్న పాత్రలే ఎంచుకుంటూ.. తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంటుంది.

ఇక ఈ మధ్య సాయిపల్లవి చెల్లి పెళ్లి జరిగింది. ఈ మ్యారేజ్‌లో ఈ నటి చేసిన సందడి మాములుగా లేదు.తాజాగా సాయి పల్లవి పాత ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో సాయి పల్లవి తన పర్సనల్ విషయాలను పంచుకుంది. తన అసలు పేరు, హైట్, వెయిట్, ఎన్ని భాషలు మాట్లాడుతుంది ఇలా చాలా విషయాలను పంచుకుంది. అందులో సాయి పల్లవి అసలు పేరు సాయి పల్లవి సింతామరై అని తెలిపింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story