- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ డైలాగ్ డిలీట్ చేస్తేనే, ఆదిపురుష్ మూవీ రిలీజ్ చేయనిచ్చారా?
దిశ, వెబ్‌డెస్క్ : ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఆదిపురుష్ మూవీ, నేడు గ్రాండ్‌గా రిలీజైంది. ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా, ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే సినిమాలో ఓ డైలాగ్‌ను తొలిగించారంట. ఆ డైలాగ్‌ను తొలిగిస్తేనే, మూవీ రీలీజ్ చేసే పరిస్థితి ఎదురయ్యిందంట.
ఆదిపురుష్ మూవీని ప్రపంచవ్యాప్తంగా 7 వేల థియేటర్లలో విడుదల చేస్తున్నరన్న విషయం తెలిసిందే. అయితే నేపాల్ లో ఈ సినిమా రిలీజ్ ను అడ్డుకుంటామని ఖాట్మండు మెట్రోపాలిటన్ సిటీ మేయర్ బాలెన్ షా సోషల్ మీడియా ద్వారా చెప్పారు. దానికి కారణం ఈ సినిమా ట్రైలర్ లో “సీత భారతదేశపు కుమార్తె” అనే డైలాగ్ ఉంది.ఈ డైలాగ్ పై ఖాట్మండు మేయర్ బాలెన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే సీత జన్మస్థలం గురించిన మిస్టేక్ ను సరిచేయాలని ఆదిపురుష్ మేకర్స్ ను కోరారు. ఇదే విషయం పై నేపాల్ సెన్సార్ ప్యానెల్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. అందువల్ల ఆ డైలాగ్ ని సినిమా నుండి డిలీట్ చేశారని తెలుస్తోంది.
Read More: ఆదిపురుష్ రిలీజ్ రోజే డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ