ఇన్‌స్టాగ్రామ్‌తో ‘సితార’ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

by Anjali |   ( Updated:2024-01-21 08:07:02.0  )
ఇన్‌స్టాగ్రామ్‌తో ‘సితార’ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?
X

దిశ, సినిమా: సూపర్ మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి సుపరిచితమే. ఈ అమ్మడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ.. ఏదో ఒక పోస్ట్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది. చిన్న వయసులో సితార హీరోయిన్‌ రేంజ్‌లో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకోవడం విశేషం. ఇక ఈ మధ్యనే సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఇందులో తన డాన్స్ వీడియోలు అప్లోడ్ చేస్తుంటుంది. ఇదంతా పక్కన పెడితే..

సితార ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పలు ప్రమోషనల్ వీడియోలు కూడా చేస్తుంటారట. కాగా ఈ చిన్నారి ఇన్‌స్టా ద్వారా నెలకు ఎంత సంపాదిస్తుందన్న వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సితార నెలకు సుమారు రూ. 30 లక్షల వరకు ఆదాయం అందుకుంటుందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ‘‘ఇంత చిన్న ఏజ్‌లో ఆ రేంజ్ లో ఆదాయం రాబడుతుందంటే సూపర్ స్టార్ డాటర్ మామూలు అమ్మాయి కాదు.. తన తెలివికి మొక్కాలి.. స్టార్ హీరోయిన్లు కూడా వేస్ట్’’ అంటూ గ్రేట్ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed