జపాన్‌లో ‘రంగస్థలం’.. అదరగొడుతున్న అడ్వాన్స్ బుకింగ్‌లు

by sudharani |   ( Updated:2023-07-13 13:11:27.0  )
జపాన్‌లో ‘రంగస్థలం’.. అదరగొడుతున్న అడ్వాన్స్ బుకింగ్‌లు
X

దిశ, సినిమా: ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీతో సత్తా చాటిన రామ్ చరణ్ క్రేజ్ ఖండాలు దాటి పాన్ వరల్డ్ రేంజ్‌కు వెళ్లింది. అయితే చరణ్ నటించిన ‘రంగస్థలం’ మూవీ భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఇందులో మరో కొత్త చరణ్‌ను చూపించాడు దర్శకుడు సుకుమార్. అయితే ఈ చిత్రాన్ని మిగతా భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకోగా.. ఎట్టకేలకు ఈ సినిమాను జపాన్ భాషలోకి డబ్ చేశారు మేకర్స్. అంతేకాదు జూలై 14న మూవినీ గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. దీంతో పాటు ‘KGF’ను కూడా విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘రంగస్థలం’ మూవీకి కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రెండు మిలియన్ జపనీస్ డాలర్లు వచ్చాయట.

Advertisement

Next Story