Nayanthara: ట్వీట్లకు రియాక్ట్ అవకండి.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ స్టార్ హీరోయిన్ పోస్ట్

by Hamsa |   ( Updated:2024-09-14 13:29:19.0  )
Nayanthara: ట్వీట్లకు రియాక్ట్ అవకండి.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ స్టార్ హీరోయిన్ పోస్ట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రజెంట్ ఈ అమ్మడు ఒరువన్ పార్ట్-2, మన్నన్‌గట్టి 1960, డియర్ స్టూడెంట్స్ సినిమాలు చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా, నయనతార తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు వెల్లడించింది. ‘‘నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. కాబట్టి ఈ అకౌంట్ నుంచి వచ్చే సందేశాలకు కానీ, అనవసరమైన, వింత ట్వీట్లకు స్పందించకండి’’ అని రాసుకొచ్చింది.

తన అకౌంట్ విషయంలో సైబర్ పోలీసులకు కంప్లైంట్ కూడా చేశానని తొందరలోనే మీ ముందుకు వస్తానని మరో పోస్ట్ ద్వారా తెలిపింది. అయితే ఇటీవల సినీ ప్రముఖులు అకౌంట్స్ హ్యాక్‌కు గురవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొంతమంది సినీ స్టార్స్ తమ అకౌంట్ హ్యాక్ అయితే రికవరీ చేయించుకున్నారు. ఇప్పుడు నయనతార వంతు వచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నయన్ ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు.

Advertisement

Next Story

Most Viewed